Acharya: మెగాస్టార్ మూవీ షూటింగ్‌‌‌‌‌‌‌కు బయలుదేరిన ‘సిద్ద’… వైరల్ అవుతున్న రామ్‌‌‌‌‌‌చరణ్ ఫోటోలు..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య .. ఈ సినిమాకోసం మెగా అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు...

Acharya: మెగాస్టార్ మూవీ షూటింగ్‌‌‌‌‌‌‌కు బయలుదేరిన సిద్ద... వైరల్ అవుతున్న రామ్‌‌‌‌‌‌చరణ్ ఫోటోలు..

Updated on: Feb 18, 2021 | 3:05 PM

Acharya movie : మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య .. ఈ సినిమాకోసం మెగా అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. చిరంజీవితో పాటు ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. దాదాపు 40నిమిషాల నిడివి ఉన్న పాత్రతో చెర్రీ అందరినీ ఆకట్టుకోనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో చిరు, చెర్రీ ఇద్దరూ పాల్గొంటున్నారు.

తాజాగా.. రామ్‌చరణ్‌ ఆచార్య షూటింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి మారేడుమిల్లి ఫారెస్ట్ కు బయలుదేరాడు. రామ్‌ చరణ్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.  బుధవారం జరిగిన ‘ఉప్పెన’.. సక్సెస్ మీట్ లో పాల్గొన్న చెర్రీ.. త్వరలోనే ఆచార్య షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపాడు.

ఇప్పటికే ఖైదీ నెం 150లో ‘అమ్ముడు లెట్స్‌ డూ కుమ్ముడు’ అంటూ ఇప్పటికే.. ఫ్యాన్స్‌కు టన్నుల కొద్ది జోష్‌ ఇచ్చిన.. చిరు, చెర్రీలు.. ఇప్పుడు మరోసారి.. ఒకే తెరపై కనిపించి అభిమానులలో ఆనందాన్ని నింపనున్నారు. ఇదిలా ఉంటే తమిళ దర్శకుడు శంకర్‌ సినిమాలో రామ్ చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సంబందించి ఓ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కనున్న చిత్రంలో కథానాయికగా రష్మిక మందన నటించనుందని వార్తలొస్తున్నాయి. చరణ్‌ – రష్మిక పేరును శంకర్‌, దిల్‌రాజులకు సూచించాడని చెప్పుకుంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

హైస్పీడ్ వలన ఆరుసార్లు చలానా.. ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ పోలీసులకు ఫైన్ కట్టానని ఒప్పుకున్న యంగ్ హీరో..