Mega Heros: ఎవ్వరి డేట్స్‌ని వాళ్లు రౌండప్ చేసుకోవడంతో.. ట్వంటీ21 క్యాలెండర్ మొత్తం పుష్టిగా.. స్టఫ్డ్‌గా తయారైంది. థియేటర్ ఆక్యుపెన్సీని కూడా సెంట్రల్ గవర్నమెంట్ వంద శాతానికి పెంచడంతో ఈ ఏడాది వసూళ్లు విరగపండడం ఖాయమన్న శుభ సంకేతాలు కూడా వున్నాయి. కానీ.. అప్‌కమింగ్ బాక్సాఫీస్ లెక్కల్లో ఆ ఒక్క ఫ్యామిలీయే హవా చాటబోతోందట. ఏ ఫ్యామిలీ ఏమా కథ..?
ఈసారి టాలీవుడ్‌లో మేజర్ వాటా మెగాఫ్యామిలీదే అనే సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. రిలీజ్ డేట్ల లైనప్‌లో క్లియర్‌గా కనిపిస్తున్న సినిమాల్లో ఆరేడు కర్చీఫులు మెగా హీరోలవే. ఫిబ్రవరి 12న రిలీజయ్యే ‘ఉప్పెన’తో సైలెంట్‌గా మొదలుకానుంది మెగా సునామీ.
ఏప్రిల్ 9న రిలీజయ్యే ‘వకీల్‌సాబ్’ మూవీ పవన్ రీఎంట్రీ ప్రాజెక్ట్‌గా స్పెషల్ క్రేజ్‌తో ప్రమోట్ అవుతోంది. మెగాస్టార్ 153వ మూవీ ‘ఆచార్య’.. మే 13న రాబోతోంది. చిరూ సెకండ్ ఇన్నింగ్స్‌లో వస్తున్న ఈ ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ.. కమర్షియల్లీ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల తీస్తున్నారు.
వరుణ్‌తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న మూవీ ‘గనీ’ జూలై 30ని కన్‌ఫమ్ చేసుకుంది. ఆ వెంటనే పోస్ట్ సమ్మర్ సీజన్‌ని అల్లువారబ్బాయి ఫోకస్ చేశాడు. ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ ఫ్రమ్ బన్నీ సైడ్… పుష్ప.. ఐదుభాషల్లో ఆగస్టు 13న రిలీజవుతోంది. ఇలా దేనికదే స్పెషల్ అనిపించే మెగా మూవీస్ అన్నీ క్యూకట్టేశాయి.
అన్‌లాక్ సీజన్‌ని విజయవంతంగా స్టార్ట్ చేసిన సాయిధరమ్‌తేజ్ కొత్త క్యాలెండర్‌ని మిస్ చేసుకుంటారా లేక.. తన రిపబ్లిక్ మూవీని రెడీ చేసుకుంటారా అనేది చూడాలి. అటు అల్లు శిరీష్, మెగా అల్లుడు కల్యాణ్‌దేవ్ మాత్రం జస్ట్ మిస్ అంటున్నారు. అటు.. వెంకీతో కలిసి వరుణ్‌తేజ్ చేస్తున్న ఎఫ్3.. తారక్‌తో కలిసి చెర్రీ నటిస్తున్న ట్రిపులార్ కూడా ట్వంటీ21లో మోస్ట్ ఫేవరిట్ మూవీస్ జాబితాలో వున్నాయి. ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్‌లో 60 శాతం వాటా మెగా కాంపౌండ్‌దేననే క్లారిటీ వస్తోంది.
Also Read: