Varun Tej: ఈ సారి మెగా హీరో పంచ్ గట్టిగానే ఉండేలా కనిపిస్తుందే.. హిట్టు పక్కనా..

|

Mar 03, 2022 | 7:21 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్న సినిమా గని. ఈ సినిమాకు  కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ కంపెనీ, రెనైసెన్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన..

Varun Tej: ఈ సారి మెగా హీరో పంచ్ గట్టిగానే ఉండేలా కనిపిస్తుందే.. హిట్టు పక్కనా..
Ghani
Follow us on

Varun Tej-: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్న సినిమా గని. ఈ సినిమాకు  కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ కంపెనీ, రెనైసెన్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే విడుదలైన రోమియో జూలియట్ పాటకు సైతం మంచి స్పందన వస్తుంది. లెజెండరీ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఈ పాట పాడారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నారు. ఇందుకోసం శిక్షణ కూడా తీసుకున్నాడు వరుణ్.

ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఈ సినిమా ఎప్రిల్ 8న విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు ఈ మెగా ప్రిన్స్. ఈ సినిమాతోపాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss OTT: ప్రేక్షకులకు షాక్.. ఆగిపోయిన బిగ్‏బాస్ నాన్‏స్టాప్.. కారణం చెప్పిన నిర్వాహకులు..

Rana Daggubati: అసలు హీరో అంటే ఏంటో తెలిసింది.. ఈ సినిమాకు ఆయనే వెన్నెముక.. రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్..