Kavya Thapar: మద్యం మత్తులో హీరోయిన్ హంగామా.. నడిరోడ్డులో siపై దాడి.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ అలా.. వీడియో

Kavya Thapar: మద్యం మత్తులో హీరోయిన్ హంగామా.. నడిరోడ్డులో siపై దాడి.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ అలా.. వీడియో

Anil kumar poka

|

Updated on: Mar 03, 2022 | 7:23 PM

Kavya Thapar: ఏక్ మినీ కథతో టాలీవుడ్‌ లో ఫేమస్ బ్యూటీగా మారింది కావ్య తాపర్‌. ఆ సినిమా తరువాత మరో సినిమాతో ఇప్పటి వరకు మన ముందుకు రాని ఈ బ్యూటీ... తాజాగా మద్యం మత్తులో హల్‌ చల్ చేసి అంతటా హాట్ టాపిక్ గా మారింది.


ఏక్ మినీ కథతో టాలీవుడ్‌ లో ఫేమస్ బ్యూటీగా మారింది కావ్య తాపర్‌. ఆ సినిమా తరువాత మరో సినిమాతో ఇప్పటి వరకు మన ముందుకు రాని ఈ బ్యూటీ… తాజాగా మద్యం మత్తులో హల్‌ చల్ చేసి అంతటా హాట్ టాపిక్ గా మారింది.మద్యం మత్తులో ముంబయ్‌ రోడ్లపై హంగామా చేసింది కావ్య తాపర్. ఇక నటి చేసిన రచ్చకు ముంబై పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఓ వ్యక్తి కారును ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా పోలీసులపై దాడి చేసి.. దుర్భాషలాడింది. దీంతో హీరోయిన్‌ కావ్య తాపర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నటిని అంధేరి కోర్టులో హాజరుపరిచారు.ఇక కోర్టు ప్రస్తుతం కావ్య తాపర్ ను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది. అయితే జుహులోని jw మారియట్‌ హోటల్‌ ఎదుట యాక్సిడెంట్‌ జరిగినట్లు జుహు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు కాల్‌ రావడంతో … నిర్భయ స్క్వాడ్‌, పలు విభాగాలకు చెందిన పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యాక్సిడెంట్ పై కావ్య నుంచి వివరాలు సేకరిస్తుండగా మహిళా పోలీస్‌ అధికారి కాలర్ పట్టుకొని, బూతులు తిడుతూ దురుసుగా ప్రవర్తించిందని పోలీసులు చెప్పారు. దీంతో బ్యూటీ కావ్యను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్