మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసి తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఎన్నో హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో.. ప్రస్తుతం కార్తక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సాయి తేజ్ కెరీర్లో 15వ చిత్రంగా వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం SD15 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపోందుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది . అక్టోబర్ 15న సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో తేజ్ తన చేతిలో ఒక కాగడా పట్టుకొని నిలబడి ఉండగా.. అతని ఎదురుగా అనేక మంది నిలబడి ఉన్నారు. తేజ్ ఫేస్ కనిపించకుండా డిజైస్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇందులో సాయితేజ్ సరసన భీమ్లానాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా డైరెక్టర్ సుకుమార్ సైతం ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు.
స్టోరీ, స్క్రీన్ ప్లే విషయంలో సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాకు శ్యామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మూవీకి సంబంధఇంచిన పూర్తి అప్డేట్స్ త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.
Celebrating our Supreme Hero @IamSaiDharamTej b’day with an Intriguing Poster from #SDT15 ?
Title reveal with Sneak peek video ?
Mystery Unveils, Summer 2023 ✅@karthikdandu86 @iamsamyuktha_ @AJANEESHB @Shamdatdop @aryasukku @BvsnP @bkrsatish @SVCCofficial @SukumarWritings pic.twitter.com/JVLdsdyLkc
— SVCC (@SVCCofficial) October 15, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.