pavan tej konidela: ప్రముఖ యాంకర్‎తో కొణిదెల హీరో ఎంగేజ్మెంట్.. వైరలవుతున్న ఫోటోస్..

పవన్ తేజ్ హీరోగా నటించిన ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాలో మేఘన హీరోయిన్‏గా నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

pavan tej konidela: ప్రముఖ యాంకర్‎తో కొణిదెల హీరో ఎంగేజ్మెంట్.. వైరలవుతున్న ఫోటోస్..
Pavan Tej

Updated on: Aug 12, 2022 | 9:59 AM

ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు కొణిదెల పవన్ తేజ్. మెగా ఫ్యామిలీని నుంచి హీరోగా అరంగేట్రం చేసిన ఈ కుర్రాహీరో ఇక ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బుల్లితెర ప్రముఖ యాంకర్ మేఘనను పవన్ తేజ్ వివాహం చేసుకోబోతున్నారు. బుధవారం ఇరుకుటుంబాల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, యాంకర్ సుమ, రాజీవ్ కనకాల, సాయి ధరమ్ తేజ్ తదితరులు హాజరయ్యారు. పవన్ తేజ్ హీరోగా నటించిన ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాలో మేఘన హీరోయిన్‏గా నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో త్వరలోనే వీరు పెళ్లిపీటలెక్కబోతున్నారు.

ఆమెను ప్రేమిస్తున్నాను. నాకు ప్రేమంటే తెలిసింది ఆమె వల్లే. మా ఇద్దరి ప్రయాణం ఇప్పుడే మొదలైంది అంటూ తన నిశ్చితార్థం ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు పవన్ తేజ్. అలాగే నా జీవితం నీకే సొంతం. ప్రేమ తెలిసిన నీతోనే నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం నా మనసు గాల్లో తేలుతుంది అంటూ ఇన్ స్టాలో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.