Tollywood: 50 సెకన్లకు రూ.5 కోట్లు తీసుకున్న హీరోయిన్.. వివాదాలతోనే ఫేమస్.. ఎవరంటే..

ప్రస్తుతం ఆమె సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి సూపర్ స్టార్ క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు.. 50 సెకన్ల ప్రకటనకు ఏకంగా రూ.5 కోట్లు వసూలు చేసింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Tollywood: 50 సెకన్లకు రూ.5 కోట్లు తీసుకున్న హీరోయిన్.. వివాదాలతోనే ఫేమస్.. ఎవరంటే..
Nayanthara

Updated on: Feb 25, 2025 | 6:59 PM

ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఈ హీరోయిన్ క్రేజ్ సెపరేట్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అందం, అభినయంతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. నటనకే కాదు.. స్టార్ డమ్ తో సైతం వార్తలలో నిలిచింది. ఆమెను ఓ కమర్షియల్ ప్రకటన కోసం సంప్రదించగా.. కేవలం 50 సెకన్ల ప్రకటనకు రూ.5 కోట్లు అందుకుంది. అంటే ఒక సినిమా రెమ్యునరేషన్ తీసుకుంది. ఆమె మరెవరో కాదు.. లేడీ సూపర్ స్టార్ నయనతార. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె టాప్ హీరోయిన్. ఇప్పుడిప్పుడే హిందీ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తుంది. ఆమె సినీ ప్రయాణం అంత సులభం కాదు.ఆమెకు నటనా రంగంలోకి ప్రవేశించే ఉద్దేశం లేదు. అప్పటికే ఇంగ్లీష్ డిగ్రీ కంప్లీట్ చేసింది. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని ఎన్నో కలలు కన్నది. కానీ అనుకోకుండా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

నయనతార ఇప్పటివరకు 80 కి పైగా సినిమాల్లో నటించింది. ఆమె తనను తాను దక్షిణ భారత పరిశ్రమకే పరిమితం చేసుకోలేదు. ఆమె రజనీకాంత్, షారుఖ్ ఖాన్, నాగార్జున, జయరామ్ వంటి ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు. 2015లో, ఆమె ‘నానం రౌడీ ధన్’ సినిమా సెట్స్‌లో దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను కలిసింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆరేళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2022లో వివాహం చేసుకున్నారు. ఈ జంట సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు.

ఇవి కూడా చదవండి

నయనతార పెళ్లి వేడుక ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ అనే డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. నయనతార ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా సూపర్ హిట్ అయినా, షారుఖ్ ఖాన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ఆమె హిందీ సినిమాల్లో మరింత యాక్టివ్‌గా మారడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు 10 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ఇటీవల, ఆమె 50 సెకన్ల ప్రకటన కోసం రూ. 5 కోట్లు వసూలు చేసింది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..