Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఖిలాడి సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కోసం మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ సినిమాతోపాటే త్రినాద్ రావ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ధమాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలతోపాటు క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మతో ఓ సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. ఈ కాంబినేషన్ లో రాబోతున్న సూపర్ క్రేజీ మూవీ రావణాసుర. ఈ భారీ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. దీపావళికి రిలీజైన ఈ భారీ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రావణాసురలో కథానాయకుడు పది డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తుండడం విశేషం.
రావణాసురలో రవితేజ లాయర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా సంక్రాంతి పండక్కి జనవరి 14న లాంఛనంగా ప్రారంభం కానుంది. రావణాసుర చిత్రానికి శ్రీకాంత్ విస్సా పవర్ ఫుల్ స్టోరీ అందించారు. స్టైలిష్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రంలో రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ముగ్గురు భామలతో రవితేజ రొమాన్స్ చేయనున్నాడట. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్.. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా మేఘా ఆకాష్.. నటించనున్నారు. అలాగే ఈ సినిమాలో పవర్ ఫుల్ లేడీ విలన్ గా `జాంబిరెడ్డి` ఫేమ్ దక్షా నాగర్కర్ కనిపించనుంది. ఇక రావణాసుర సినిమాలో రవితేజ విలక్షణమైన పాత్రలో కనిపిస్తాడని పోస్టర్‌లోనే తెలిసిపోతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :