RamaRao On Duty: స్పీడ్ పెంచిన రవితేజ.. రామారావు ఆన్ డ్యూటీ స్ట్రీమింగ్ రైట్స్ ఫిక్స్..

|

Feb 27, 2022 | 6:34 PM

క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్‏తో రవితేజ (Raviteja) మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ సూపర్ హిట్ మూవీ తర్వాత రవితేజ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

RamaRao On Duty: స్పీడ్ పెంచిన రవితేజ.. రామారావు ఆన్ డ్యూటీ స్ట్రీమింగ్ రైట్స్ ఫిక్స్..
Ramarao On Duty
Follow us on

క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్‏తో రవితేజ (Raviteja) మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ సూపర్ హిట్ మూవీ తర్వాత రవితేజ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఖిలాడి సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచి కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ప్రస్తుతం మాస్ మాహారాజా.. ధమాకా.. రామారావు ఆన్ డ్యూటీ (RamaRao On Duty) సినిమాల్లో నటిస్తున్నాడు. డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికకారిగా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ చేశారు మేకర్స్..

ఈ సినిమా హిందీ స్ట్రీమింగ్ రైట్స్‏ను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి కాగా రెండు పాటల చిత్రీకరణ పెండింగ్లో ఉంది. సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ LLP మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం మార్చి 1వ తేదీన మహా శివరాత్రి శుభ సందర్భంగా ఈ టీజర్ విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తుండగా.. నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖ వాణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి సంగీతం శామ్ సిఎస్ అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్సి కెమెరా క్రాంక్ చేశారు.

Also Read: Prudhvi Raj: భీమ్లా నాయక్ సినిమాపై పృథ్వీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ విషయంలో బాధగా ఉందంటూ..

Shruti Haasan: కరోనా బారిన పడ్డ హీరోయిన్.. ఆందోళనలో సలార్ చిత్రయూనిట్..

Prakash Raj: చిత్రపరిశ్రమను క్షోభపెడుతూ ప్రోత్సాహిస్తున్నామంటే నమ్మాలా ?.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్..

Chiranjeevi : గ్యాంగ్‌లీడర్‌ మార్క్ మసాలా ఎంటర్‌టైనర్‌‌తో రానున్న మెగాస్టార్..?