AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravanasura: స్పీడ్ పెంచిన మాస్ రాజా.. సెకండ్ సింగిల్ తో రానున్న రావణాసుర

క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌పై రూపొందుతున్న ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ తో ఈసారి థ్రిల్ చేయడానికి సిద్ధంగా వున్నారు. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Ravanasura: స్పీడ్ పెంచిన మాస్ రాజా.. సెకండ్ సింగిల్ తో రానున్న రావణాసుర
Ravanasura
Rajeev Rayala
|

Updated on: Feb 13, 2023 | 3:23 PM

Share

వరుస బ్లాక్‌బస్టర్‌లతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు మాస్ మహారాజా రవితేజ. ఇటీవలే ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు రవితేజ. అలాగే మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌పై రూపొందుతున్న ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ తో ఈసారి థ్రిల్ చేయడానికి సిద్ధంగా వున్నారు. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

రవితేజ పుట్టినరోజున రావణాసుర డిఫరెంట్ షేడ్స్ చూపించే ఒక గ్లింప్స్ విడుదల చేయడం ద్వారా ప్రమోషన్లను ప్రారంభించారు మేకర్స్. ఇటీవల హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన థీమ్ సాంగ్‌ను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌లను స్టార్ట్ చేశారు. ఎలక్ట్రిఫైయింగ్, వైబ్రెంట్ ట్రాక్ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. హర్షవర్ధన్ రామేశ్వర్‌తో పాటు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ రోజు మేకర్స్ రెండవ సింగిల్ ప్యార్ లోన పాగల్ లిరికల్ వీడియోను ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు. షేడ్స్‌తో బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన రవితేజ పోస్టర్‌లో అల్ట్రా-స్టైలిష్‌గా కనిపిస్తు గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్ తో ఆకట్టుకున్నారు.

సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఏప్రిల్ 7,2023న రావణాసురు గ్రాండ్‌గా విడుదల కానుంది.

View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

Follow Us
12 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే
12 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!