Krack Hindhi Remake: బ్లాక్‌బాస్టర్ ‘క్రాక్’ హిందీ రిమేక్‌పై ఆ ముగ్గురు హీరోల ఆసక్తి.. టాప్ లేపేది ఎవరో..?

|

Jan 28, 2021 | 9:11 PM

సౌత్‌ సినిమాలకు బాలీవుడ్‌లో డిమాండ్‌ పెరుగుతోంది. ఒకప్పుడు మన సినిమాలను పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ బాబులు... ఇప్పుడు మాత్రం రీమేక్‌ హక్కుల కోసం క్యూ కడుతున్నారు.

Krack Hindhi Remake: బ్లాక్‌బాస్టర్ క్రాక్ హిందీ రిమేక్‌పై ఆ ముగ్గురు హీరోల ఆసక్తి.. టాప్ లేపేది ఎవరో..?
Follow us on

Krack Hindhi Remake:  సౌత్‌ సినిమాలకు బాలీవుడ్‌లో డిమాండ్‌ పెరుగుతోంది. ఒకప్పుడు మన సినిమాలను పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ బాబులు… ఇప్పుడు మాత్రం రీమేక్‌ హక్కుల కోసం క్యూ కడుతున్నారు. కష్టాల్లో ఉన్న బాలీవుడ్ హీరోలకు సౌత్‌ సినిమాలు సక్సెస్‌ బూస్ట్ ఇస్తుండటంతో సూపర్‌ హిట్ సౌత్‌ సినిమాలు మాకే కావాలంటున్నారు బడా హీరోలు.

తాజాగా క్రాక్ విషయంలోనూ ఇలాంటి సందడే కనిపిస్తోంది. మాస్‌ మసాలా కంటెంట్‌తో సూపర్‌ హిట్ అయిన క్రాక్‌ సినిమాను బాలీవుడ్‌ లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ రీమేక్‌లో సల్మాన్ ఖాన్‌, అజయ్‌ దేవగన్‌ లాంటి స్టార్ హీరోలు నటిస్తే బాగుంటుందని ఇప్పటికే చెప్పారు డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని.

గోపి కోరుకున్నట్టుగానే సల్మాన్‌, అజయ్‌, షాహిద్‌ లాంటి క్రేజీ హీరోలు క్రాక్ రీమేక్‌ మీద దృష్టి పెట్టారట..! సౌత్‌ రీమేక్‌లతోనే సూపర్‌ హిట్స్ కొట్టిన ఈ హీరోలు… క్రాక్‌ లాంటి సినిమా చేస్తే రిజల్ట్ మరో రేంజ్‌లో ఉంటుందన్నది బాలీవుడ్‌లో వినిపిస్తున్న మాట. మరి ఈ హీరోలు.. ఫైనల్‌గా సిల్వర్‌ స్క్రీన్ మీద క్రాక్ చూపించేది ఎవరు..? ఈ విషయంలో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read:

F3 MOVIE: కో బ్ర‌ద‌ర్స్ చేసే ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్ త్వ‌ర‌లో తెర‌మీద‌కు… ఎఫ్‌3 మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన ‘వంటలక్క కూతురు’.. తన ముద్దు ముద్దు మాటలతో..