
మన భారతీయ యాక్టర్స్‌కి వృత్తిపై అపారమైన గౌరవం ఉంటుంది. విభిన్న తరహా కథలు, పాత్రలు ఎంచుకుంటూ.. అందుకు తగ్గట్లుగా తమ ఆహార్యాన్ని మార్చుకుంటూ ప్రేక్షకులకు థ్రిల్ అందించేందుకు కష్టపడుతూ ఉంటారు. పాత్ర కోసం ప్రాణం పెట్టే విక్రమ్, సూర్య, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలు.. సౌత్ హీరోలకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిస్తూనే ఉన్నారు. ఆ కోవకే చెందిన హీరో ఇతను. ఇటీవల తన మార్కో సినిమాతో మాలీవుడ్‌ను షేక్ చేశాడు ఉన్ని ముకుందన్. దీన్ని భారతీయ చిత్ర సీమలో మోస్ట్ వయిలెంట్ మూవీగా చెబుతున్నారు. ఈ యాక్షన్ అడ్వంచరెస్‌కు ఫిదా అయిన మాస్ ఆడియన్స్… ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ ఇచ్చారు.
ఇంత పెద్ద హిట్ ఇచ్చిన హీరో ముకుందన్.. రోడ్డు పక్కన పిల్లలతో సరదాగా క్రికెట్ ఆడుతోన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సినిమా షూటింగులకు కాస్త బ్రేక్ ఇచ్చి.. తన బాల్యాన్ని ఇలా ఆటతో నెమరువేసుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ చేస్తూ వారిలో ఒకరిగా కలిసిపోయాడు. పిల్లలతో కలిసిపోయి ఎంచక్కా క్రికెట్ ఆడుతోన్న ఈ స్టార్ క్రికెటర్ వీడియోపై పలువురు సెలబ్రిటీలు కూడా సూపర్ అంటూ రెస్పాండ్ అయ్యారు.
వీడియోను దిగునవ చూడండి…
ఇక ఉన్ని ముకుందన్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. గంధర్వ జూనియర్ అనే ఫాంటసీ సూపర్ హీరో పిక్చర్ చేస్తున్నాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఈ తరహా కాన్సెప్ట్ రాలేదని ఆయనే చెబుతున్నాడు. చూస్తుంటే పాన్ ఇండియా మార్కెట్‌పై ఈ హీరో గట్టిగానే కన్నేసినట్లు కనిపిస్తున్నాడు. ఇక ప్రేమలు మూవీ డైరెక్టర్ ఆల్ఫాన్సో పుత్రేన్‌తోనూ ఉన్ని ముకుందన్ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.