Ponniyin Selvan: సొంత గడ్డ మీద పీఎస్‌ వన్ జోరు.. మణిరత్నం ప్లాన్ వర్కౌట్ అయ్యిందిగా..

డైరెక్టర్ మణిరత్నం కలల ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ బాక్సాఫీస్ వద్దు దూసుకుపోతుంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమాకు మిగతా భాషల్లో మెప్పించినా.. తమిళనాడులో మాత్రం రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే రూ. 200 కోట్ల మార్క్ క్రాస్ చేసింది.

Ponniyin Selvan: సొంత గడ్డ మీద పీఎస్‌ వన్ జోరు.. మణిరత్నం ప్లాన్ వర్కౌట్ అయ్యిందిగా..
Ponniyin Selvan

Updated on: Oct 22, 2022 | 4:35 PM

పొన్నియిన్‌ సెల్వన్ సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం… తన టార్గెట్‌ను పర్ఫెక్ట్‌గా రీచ్ అయ్యారు. చాలా రోజులుగా మణి మార్క్‌ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్‌… పీఎస్‌ 1 సక్సెస్‌ను గ్రాండ్‌గా సెల్రబేట్ చేసుకుంటున్నారు. పొన్నియిన్ సెల్వన్‌... తమిళ సినిమా దశాబ్దాల కల. ఎంతో మంది టాప్ స్టార్స్ ఈ సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఫైనల్‌గా మణిరత్నం ఆ కలను నిజం చేశారు. తమిళుల ఘన చరిత్రకు దృశ్యరూపమిచ్చారు. పెరిగిన మార్కెట్‌… సినిమా స్పాన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను భారీగా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించారు మణిరత్నం.

పేరుకు పాన్ ఇండియా అయినా పొన్నియన్‌ సెల్వన్‌ను పక్కా తమిళ సినిమాగానే ప్రొజెక్ట్ చేశారు మేకర్స్‌. ఈ సినిమాలో నటించిన వారిలో ఒక్క ఐశ్వర్యరాయ్‌ తప్ప మిగతా అందరూ తమిళ నటులే. తమిళ సోల్‌తో తెరకెక్కిన కథ కావటంతో కాస్టింగ్ విషయంలోనూ అక్కడి వారికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. పబ్లిసిటీని కూడా తమిళనాడు సెంట్రిక్‌గానే ప్లాన్ చేశారు. ట్రైలర్‌, మ్యూజిక్ లాంచ్‌ ఈవెంట్‌ను చెన్నైలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో సినిమాను భారీగా రిలీజ్ చేసినా… ప్రమోషన్ మాత్రం ప్రెస్‌మీట్లతో సింపుల్‌గా ముగించేశారు.

దీంతో ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందా…? అన్న అనుమానాలు కూడా క్రియేట్ అయ్యాయి. అయితే మణిరత్నం స్ట్రాటజిక్‌గానే పొన్నియిన్‌ సెల్వన్‌ను తమిళ సినిమాగా ప్రమోట్‌ చేశారన్న విషయం అర్ధమవుతోంది. ఈ సినిమా ఇతర భాషల్లో కనెక్ట్ అవ్వటం కష్టమే అని ఫిక్స్ అయిన మణి.., తమిళనాడు విషయంలోనే సీరియస్‌గా ఫోకస్‌ చేసి… తన టార్గెట్‌ రీచ్ అయ్యారు.

పొన్నియిన్ సెల్వన్ తమిళనాట సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే కోలీవుడ్‌లో 200 కోట్ల మార్క్‌ను రీచ్ అయిన ఈ మూవీ… ఈ ఘనత సాధించిన తొలి తమిళ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ముందు ముందు ఈ సినిమా మరిన్ని రికార్డ్స్ సాధించటం ఖాయం అంటున్నారు తమిళ తంబీలు.