Ponniyin Selvan-1 Twitter Review: పొన్నియన్ సెల్వన్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే

|

Sep 30, 2022 | 10:00 AM

మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాప్ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు.

Ponniyin Selvan-1 Twitter Review: పొన్నియన్ సెల్వన్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
Ponniyin Selvan
Follow us on

మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాప్ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు. ప్రిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేల నాటి చోళుల కథాంశంతో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాని రూపొందించారు మణిరత్నం. ప్రసిద్ధ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఈ సినిమాకు ఆధారం. రెండు భాగాలుగా ఈ సినిమాను తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తమిళ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ మూవీ పై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో పొన్నియన్ సెల్వన్ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో కరికాలన్‌గా విక్రమ్.. అరుణ్ మోళి వర్మన్‌గా జయం రవి.. వల్లవరాయన్ వాందివదేవన్‌గా కార్తి.. నందినిగా ఐశ్వర్యారాయ్.. కుందవై పిరిత్తియార్‌గా త్రిష నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

‘పొన్నియన్ సెల్వన్ 1’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పొన్నియన్ సెల్వన్ ను లైకా ప్రొడక్షన్స్, మణిరత్నం మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇక ఈ సినిమా పై ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు ప్రేక్షకులు.  ఆ రివ్యూలు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..