Kannappa Movie: ‘దయచేసి ఆ వార్తలు నమ్మొద్దు’.. కన్నప్ప సినిమాపై కీలక ప్రకటన

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం కన్నప్ప. ఇందులో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో పాటు దక్షిణాది, బాలీవుడ్ నుంచి పలువురు తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.

Kannappa Movie: దయచేసి ఆ వార్తలు నమ్మొద్దు.. కన్నప్ప సినిమాపై కీలక ప్రకటన
Kannappa Movie

Updated on: Apr 01, 2025 | 8:45 PM

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్నచిత్రంకన్నప్ప. అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విష్ణుతో పాటు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, , దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా ఎందరో నటులు కన్నప్ప సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేశారు మేకర్స్. కానీ కానీ వీఎఫ్ఎక్స్ పనుల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించాడు మంచు విష్ణు. తాజాగా కన్నప్ప సినిమా గురించి ఒక ఆసక్తికరమైన రూమర్ వినిపిస్తోంది. అదేంటంటే.. ఇటీవల కన్నప్ప సినిమా ప్రీమియర్ వేశారంటూ నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రసాద్ ల్యాబ్ నుంచి మంచు ఫ్యామిలీ నడిచొస్తున్న విజువల్స్ కొన్ని బయటకు వచ్చాయి. దీంతో కన్నప్ప ప్రీమియర్ వేశారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై కన్నప్ప టీమ్ స్పందించింది.

‘మార్చి 31న కన్నప్ప ప్రీమియర్ వేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. 15 నిమిషాల వీఎఫ్ఎక్స్ ఫుటేజీ క్వాలిటీ మాత్రమే చెక్ చేశాం. మూవీ ఫస్ట్ కాపీని రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాం. ఇలాంటి అబద్దపు వార్తలు నమ్మొద్దు. త్వరలోనే ఇతర వివరాలు ప్రకటిస్తాం’ అని కన్నప్ప టీమ్ క్లారిటీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

 

అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు. హిందీ మహా భారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

కన్నప్ప సినిమాలో కాజల్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.