
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కన్నప్ప.. ఈ భారీ బడ్జెట్ సినిమా రేపు ( శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తోపాటు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రభాస్ పాత్ర సినిమాలో దాదాపు 30 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి అని అంటున్నారు. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లో ప్రీమియర్ వేశారు. పలువురు సినీ సెలబ్రిటీలు, దర్శకనిర్మాతలు ఈ ప్రీమియర్ షో చూసి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే కన్నప్ప ప్రమోషన్స్ కో మంచు విష్ణు బిజీ బిజీగా ఉన్నడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న మంచు విష్ణు.. స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ గురించి కామెంట్స్ చేశారు. అసెంబ్లీ రౌడీ రీమేక్ చేస్తున్నారా అన్న ప్రశ్నకు చేసే డైరెక్టర్ లేరు అని అన్నారు మంచు విష్ణు.
శ్రీకాంత్ ఓదెల ఉన్నారుగా అంటే.. ఆయన ఒప్పుకుంటాడా లేదో.. నేను ఇంకా అడగలేదు.. అడుగుతా అన్నారు. గతంలో పూరిజగన్నాథ్ తో అనుకున్నారుగా అన్న ప్రశ్నకు.. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.. ఒకప్పటి పూరి జగన్నాథ్ అయితే బాగుండేది.. కానీ ఇప్పుడు కాదు.. ఆయనతో చేయడం కుదురుతుందో లేదో చూడాలి అని అన్నారు మంచు విష్ణు. ఈకామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మంచు విష్ణు కామెంట్స్ పై నెటిజన్స్ , పూరి జగన్నాథ్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి