టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాతో బిజి బిజీగా ఉంటున్నాడు. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడీ మంచు వారబ్బాయి. ఇప్పటికే మంచు విష్ణు తిరుపతిలో 120 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకొని వాళ్లందరికీ అవసరమైన సదుపాయాలన్ని అందిస్తున్నాడు. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం (జనవరి 26) మరో కీలక ప్రకటన చేశాడు మంచు విష్ణు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు విష్ణు ప్రో ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల త్యాగాలను గౌరవించే లక్ష్యంతో ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. ఇందులో భాగంగా త్రివిధ దళాలలో పని చేస్తున్న తెలుగు వారిని గౌరవించుకునేందుకు వారి పిల్లలకు మోహన్ బాబు యూనివర్సిటీలో 50 శాతం స్కాలర్‌షిప్‌ను అందించనున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఉండే అన్ని కోర్సులకు ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ వర్తిస్తుందని నటుడు తెలిపాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశంలో తెలుగువారు ఎక్కడున్నా త్రివిధ దళాలలో పనిచేసే ఫ్యామిలిలో పిల్లలకు కూడా ఈ స్కాలర్ షిప్ అందిస్తామన్నాడు విష్ణు.
‘ మన దేశ సంరక్షణ కోసం సైనికులు ఎన్నో త్యాగాలు చేశారు. వారి సేవలకు గౌరవ సూచికంగా, వారికి కృతజ్ఞతలు తెలపాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. దేశం కోసం నిస్వార్థంగా సేవ చేసే సైనిక కుటుంబాలకు అండగా నిలవాలని అనుకున్నాను. అందుకే మా యూనివర్సిటీలో ఈ నిర్ణయం తీసుకున్నాం. వేరే యూనివర్సిటీలు కూడా ఇలాంటి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అని మంచు విష్ణు.
మంచు విష్ణు చేసిన ప్రకటనపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారంటూ అభిమానులు, నెటిజన్లు ఈ నటుడిని కొనియాడుతున్నారు.
Happy Republic Day! Eternally grateful for the Indian Armed Forces 🙏 A Small token of appreciation from Mohan Babu University#RepublicDay #IndianArmedForces #mohanbabuuniversity #JaiHind pic.twitter.com/JGIaAUOh9b
— Vishnu Manchu (@iVishnuManchu) January 26, 2025
#ManchuVishnu adopted 120 orphans from the Matrushree organization in Bairagi Pateda, Tirupati.
He assured support for their education, healthcare, and other needs as a family member. pic.twitter.com/Vw3dXspezW
— Movies4u Official (@Movies4u_Officl) January 13, 2025
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.