టాలీవుడ్‌లో మంచు కుటుంబానికి సెపరేట్ ఐడెంటిడీ ఉంది. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పడం..ఏది అనుకుంటే అది చేయడం వారి స్టైల్. అయినా కొన్ని వందల చిత్రాలలో విలక్షణ పాత్రలు వేసిన మోహన్‌బాబు గారి స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటండి. అయితే ఆయన వారసులు అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. మనోజ్, విష్ణులకు గత కొంతకాలంగా సరైన హిట్లు లేవు. కాకపోతే మనోజ్ ఎప్పటికప్పుడు తనని కొత్తగా ఆవిష్కరించుకోవడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అతిథి పాత్రలు కూడా చేస్తాడు. వేదంలో అతడు చేసిన పాత్రకు మంచి మార్కులు దక్కాయి. మల్టీస్టారర్లు చేయడం పట్ల కూడా అతడికి బాగానే ఆసక్తి ఉంది. కానీ సరైన కాంబినేషన్ వర్కువుట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు మనోజ్ స్వయంగా ఓ మల్టీస్టారర్ కోసం ఓపెన్ ప్రపోజల్ పెట్టాడు సాయి తేజ్ ముందు. గురువారం తేజు బర్త్ డే. ఈ సందర్భంగా అతణ్ని ఆఫ్యాయంగా బాబాయ్ అని సంబోధిస్తూ ట్వీట్ పెట్టాడు మనోజ్. తేజు బర్త్ డే రోజే మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ ‘బిల్లా రంగా’ 38వ వార్షికోత్సవం జరుపుకుంటున్న విషయాన్ని అతను గుర్తు చేశాడు. అక్టోబరు 15న విడుదల అంటూ అప్పటి సినిమా పోస్టర్ కూడా పోస్ట్ చేశాడు. ఇది పంచుకోవడం ద్వారా తాను ఏం చెప్పదలుచుకున్నానో సాయి తేజ్ అర్థం చేసుకోవాలని.. ‘నేనైతే రెడీగా ఉన్నా. మరి నీ సంగతేంటి’ అని ప్రశ్నించాడు మనోజ్. ( రచ్చ కాంబినేషన్..పూరీతో యశ్ ! )
ఇంతకుముందు మంచు మనోజ్ నటించిన ‘గుంటూరోడు’ చిత్ర వేడుకలో పాల్గొన్న తేజు.. తామిద్దరం ఎప్పట్నుంచో ‘బిల్లా రంగా’ రీమేక్‌లో నటించాలనుకుంటున్నామని చెప్పాడు. దాని సంగతేంటని మనోజ్‌ను ప్రశ్నించాడు. ఆ రీమేక్‌ను సరిగా డీల్ చేయగలిగే డైరెక్టర్ దొరికినపుడు కచ్చితంగా చేద్దామని మనోజ్ చెప్పాడు. మరి ఇప్పుడు మనోజ్ ఈ రీమేక్‌లో నటించడానికి రెడీ అన్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. మరి తేజు ఏమంటాడో చూడాలి. ( సాగర తీరాన..సతీ సమేతంగా )