
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో మంచు మనోజ్. కానీ అనుకోకుండా వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆయన రీఎంట్రీ కోసం ప్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే తన కొత్త సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 2018 తర్వాత వెండితెరకు దూరంగా ఉన్నారు మనోజ్. దీంతో ఇక సినిమాలు చేయరు అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలోనే సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి.. అహం బ్రహ్మస్మి చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఆ తర్వాత మాత్రం మరో ప్రకటన రాలేదు.
అటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యారు మనోజ్. ఇటు ఇప్పుడిప్పుడే నెట్టింట వరుస అప్డేట్స్, పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మనోజ్ హీరోగా వాట్ ద ఫిష్ అనే చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. కేవలం సినిమా టైటిల్ మినహా మరో అప్డేట్ రాలేదు. తాజాగా ఓ ఆసక్తికర వీడియో షేర్ చేశారు మనోజ్. ప్రియమైన అభిమానుల కోసం తిరిగొస్తున్నా.. కొంచెం కొత్తగా.. సరికొత్తగా ర్యాంప్ ఆడించడానికి మీ రాకింగ్ స్టార్ గేమ్ షోతో మళ్లీ వస్తున్నా అంటూ ట్వీట్ చేశారు మనోజ్.
అయితే మనోజ్ రీఎంట్రీ ఇస్తుంది మాత్రం వెండితెరపైకి కాదు.. బుల్లితెరపైకి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఈటీవీ సంయుక్తగా మనోజ్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ షోను చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంటుంది. అందులో మనోజ్ తన వాయిస్ తో అసలు విషయం చెప్పేశారు.
Priyamiyna abhimanula kosam,
Tirigosthunna koncham kothaga, Sarikothaga ramp adiyadaniki…
YOUR ROCKING STAR IS BACK WITH A GAME SHOW!https://t.co/PPfTs4grcQ#RampAddidham #RockingStar #ComingSoon #ETVWin #PeopleMediaFactory@peoplemediafcy @etvwin @vishwaprasadtg… pic.twitter.com/4qBwN8nejB— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 22, 2023
“నా ప్రపంచం సినిమా. చిన్నప్పటి నుంచి సినిమా మీద నేను పెంచుకున్న ప్రేమ ఇప్పుడు నా వృత్తిగా మారింది. అదే నన్ను ఒక హీరోగా.. నటుడిగా చేసింది. అందుకు నాకు రాకింగ్ స్టార్ అనే పేరు కూడా ఇచ్చింది. ఫ్యాన్స్, విజిల్స్, అరుపులు, కేకలు ఇలా పండగల సాగే నా జీవితంలో అనుకోకుండా ఒక సైలెన్స్ వచ్చింది. మనోజ్ కెరీర్ ఖతం.. అయిపోయాడు.. యాక్టింగ్ ఆపేశాడు. ఇక మళ్లీ రాడు అన్నారు. విన్నాను… చూశాను.. అన్నింటిని మౌనంగా భరించాను. ఇప్పుడు తిరిగొస్తున్నాను” అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు . దీంతో మనోజ్ చేయబోయే షోపై మరింత క్యూరియాసిటీ నెలకొంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.