సినీ పరిశ్రమలో పలువురు స్టార్స్ కుటుంబ విషయాలు.. వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో చర్చలు జరగడం సర్వసాధారణం. మ్యారెజ్, ప్రెగ్నెన్సీ, విడాకులు, మనస్పర్థలు ఇలా ఒక్కటేమిటీ అన్ని విషయాల గురించి నెట్టింట ఇష్టానుసారంగా ట్రోల్స్ చేస్తుంటారు. అంతేకాదు కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా.. ఇన్ స్టాలో ఒక్క ఫోటో డెలిట్ చేసినా.. అనేక రూమర్స్ చక్కర్లు కొడుతుంటాయి. ఇటీవల అల్లు ఫ్యామిలీకి.. మెగా కుటుంబానికి మధ్య విభేదాలు వచ్చాయంటూ పూకార్లు తెగ వైరలయ్యాయి. అయితే తమ ఎలాంటి మనస్పర్థలు రాలేదని అలీతో సరదాగా షోలో క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్. ఇక ఇటీవల రామ్ చరణ్ ఉపాసన ఇచ్చిన క్రిస్మస్ పార్టీలో అల్లు అర్జున్, శిరీష్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆ రూమర్స్ కు చెక్ పెట్టారు. అలాగే ఇండస్ట్రీలోని మంచు ఫ్యామిలీ గురించి కూడా అనేక ట్రోల్స్ జరిగిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్, లక్ష్మీ, విష్ణు మధ్య విబేధాలు వచ్చాయని టాక్ నడిచింది. తాజాగా ఆ వార్తలపై స్పందించారు మంచు లక్ష్మి.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ.. తమ ఫ్యామిలీ గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టేశారు. తమ కుటుంబంలో విభేదాలు జరిగి ఒకరికొకరు దూరంగా ఉంటున్నారని వినిపిస్తున్న వార్తలపై మంచు లక్ష్మి మాట్లాడుతూ.. “మా కుటుంబానికి సంబంధించిన విషయాలన్నీ మా పర్సనల్. ఎందుకంటే మేమెప్పుడూ కలిసే ఉన్నాం. కాకపోతే ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.
విష్ణుకు ఫ్యామిలీ, పిల్లలు, బిజినెస్ వాటికే టైమ్ సరిపోతుంది. ఇక ఎక్కువగా నేను, మనోజ్ టైమ్ స్పెండ్ చేస్తాం. అందుకే ఎక్కడైనా మేమిద్దరమే కనిపిస్తాం. ” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో మంచు ఫ్యామలీలో ఏమి లేవని క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.