Mohanlal: ఫిట్‌నెస్‌ విషయంలో నో కాంప్రమైజ్‌ అంటోన్న కంప్లీట్‌ యాక్టర్‌.. అలవోకగా 100 కిలోల బరువెత్తిన మోహన్‌లాల్‌

ప్పుడు మోహన్‌లాల్‌ వయసు 63 ఏళ్లు. అయితే ఈ వయసులోనూ యంగ్‌ హీరోలకు ధీటుగా యాక్షన్‌ సన్నివేశాల్లో నటిస్తుంటారు. స్టంట్స్‌ చేస్తుంటారు. అయితే దీని వెనక  ఎంతో కఠోర శ్రమ ఉంది.

Mohanlal: ఫిట్‌నెస్‌ విషయంలో నో కాంప్రమైజ్‌ అంటోన్న కంప్లీట్‌ యాక్టర్‌.. అలవోకగా 100 కిలోల బరువెత్తిన మోహన్‌లాల్‌
Mohanlal

Updated on: Jul 26, 2023 | 12:33 PM

ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారాయన. ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మోహన్‌లాల్‌ వయసు 63 ఏళ్లు. అయితే ఈ వయసులోనూ యంగ్‌ హీరోలకు ధీటుగా యాక్షన్‌ సన్నివేశాల్లో నటిస్తుంటారు. స్టంట్స్‌ చేస్తుంటారు. అయితే దీని వెనక  ఎంతో కఠోర శ్రమ ఉంది. మోహన్‌లాల్‌ రోజూ జిమ్‌లో క్రమం తప్పకుండా వర్కవుట్స్‌ చేస్తుంటారు. ఫిట్‌నెస్‌ విషయంలో అసలు కాంప్రమైజ్‌ అంటోన్న ఆయన తాజాగా అలవోకగా 100 కిలోల బరువును ఎత్తారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు మోహన్‌లాల్‌కు నిజంగానే 63 ఏళ్లున్నాయా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా మోహన్‌లాల్ చాలా ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన సినిమాలు వందల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుంటాయి. మోహన్‌లాల్‌కు ఫిట్‌నెస్‌పై చాలా ఆసక్తి ఉందనడానికి ఇప్పుడు వైరల్‌గా మారిన వీడియోనే నిదర్శనం. సీనియర్ నటుడి కమిట్మెంట్ చూసి అందరూ వావ్ అంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మోహన్ లాల్ ‘మలైకోటై వాలిబన్’. ‘లూసిఫర్ 2’, ‘వృషభ’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లూసిఫర్ 2’ షూటింగ్ వాయిదా పడింది. అయితే కన్నడ దర్శకుడు నందకిషోర్ తెరకెక్కిస్తోన్న ‘వృషభ’ చిత్రం ఇటీవలే పట్టాలెక్కింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీకాంత్‌ తనయుడు రోహన్‌ కూడా ఓ కీ రోల్‌ పోషిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..