
మలయాళం హీరోల మార్కెట్ చాలా తక్కువ. కానీ అక్కడి దర్శకులకి, రచయితలకి క్రియేటివిటీ చాల ఎక్కువ. మంచి సోల్ తో..మనసును హత్తుకునే సినిమాలు తీస్తారు వాళ్లు. అందుకే వాళ్ల సినిమాలు రీమేక్స్ రూపంలో తెలుగులోకి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ‘లూసిఫర్’, ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’…ఈ లిస్టులో ఉన్నాయి. తాజాగా ఈ వరసలోకి మరో కథ కూడా చేరింది. అదే… ‘కప్పెలా’. మలయాళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం రీమేక్ హక్కుల్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ దక్కించుకుంది.
ఇద్దరు యంగ్ హీరోలతో ఈ సినిమా తెరకెక్కబోతోతున్నట్లు సమాచారం. ప్రస్తుత కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓ యంగ్ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు ‘సితార’ సంస్థ వర్గాలు తెలిపాయి.