
ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేదు. కంటెంట్ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే చాలు.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తున్నాయి సినిమాలు. పాన్ ఇండియా మూవీలు కూడా సాధించలేని రికార్డులను చిన్న సినిమాలు అందుకుంటున్నాయి. సౌత్‌లో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్నీ పాన్ ఇండియన్ సినిమాలంటూ.. లార్జర్ దెన్ లైఫ్ ఉన్న సినిమాలంటూ.. పరిగెత్తుతున్న క్రమంలో.. ఇదే సౌత్ లో ఉన్న మలయాళం ఇండస్ట్రీ మాత్రం, తనదైన స్టైల్లో దూసుకుపోతోంది. కేరళ నేటివిటీని వదిలిపెట్టకుండానే.. రీజనల్ రేంజ్‌లోనే వందల కోట్లు కొల్లగొడుతోంది. ఇక తాజాగా 2018 సినిమాతో కూడా అదే చేసి.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది మలయాళ ఇండస్ట్రీ.
టొవినో థామస్ హీరోగా.. డైరెక్టర్ జూడ్ ఆంథనీ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మే 2018. కేరళలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంలోనే వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అక్కడ సూపర్ డూపర్ హిట్టైంది. డే వన్ నుంచే కలెక్షన్ల వరద పారిస్తోంది. జెఓస్ట్ రిలీజ్ అయిన 10 రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లను సాధిచేసింది.
అయితే రీసెంట్ డేస్లో మలయాళంలో తెరకెక్కిన చిన్న సినిమాలు.. డిజాస్టర్ అవుతున్న క్రమంలో.. జెస్ట్ 15 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఈ రేంజ్ హిట్ కొట్టడం ఇప్పుడు అక్కడి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. రిమైనింగ్ ఇడంస్ట్రీస్ మేకర్స్‌ను కూడా ఈ సినిమా వైపు ఓ లుక్కేసేలా చేసుకుంటోంది.