Unni Mukundan: మేనేజర్ ఫిర్యాదుపై స్పందించిన మార్కో హీరో.. ‘విపిన్’ అలాంటి వాడంటూ సంచలన ఆరోపణలు

మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా 'మార్కో' లో లో నటించిన హీరో ఉన్ని ముకుందన్‌పై పోలీస్ స్టేషన్‌లో ఓ ఫిర్యాదు నమోదైంది. గతంలో ముకుందన్ కు మేనేజర్ గా వ్యవహరించిన వ్యక్తే ఇప్పుడు హీరోపై ఫిర్యాదు చేశాడని తెలిసింది. తాజాగా ఇదే విషయంపై ఉన్ని ముకుందన్ స్పందించాడు.

Unni Mukundan: మేనేజర్ ఫిర్యాదుపై స్పందించిన మార్కో హీరో.. విపిన్ అలాంటి వాడంటూ సంచలన ఆరోపణలు
Actor Unni Mukundan

Updated on: May 28, 2025 | 4:30 PM

‘మార్కో’ సినిమా హీరో ఉన్ని ముకుందన్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. తన మాజీ మేనేజర్‌ విపిన్‌ ఈ ఫిర్యాదు చేశాడు. ముకుందన్ తనపై దారుణంగా దాడి చేయడమే కాకుండా అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడాడని ఉన్ని ఆరోపించాడు. దీంతో ఉన్ని ముకుందన్ వ్యవహారం మాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. చాలా మంది మార్కో హీరోను విమర్శిస్తున్నారు. అయితే ఈ విషయంపై స్వయంగా నటుడు ఉన్ని ముకుందన్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమంటూ సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు. ‘నాపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధం. నాకు, విపిన్ మధ్య జరిగిన సమావేశానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యం. అలాగే, విపిన్ ఎప్పుడూ నా వ్యక్తిగత మేనేజర్ కాదు. అతను నా ఇమేజీని డ్యామేజ్ చేయాలని గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నాడు’

‘విపిన్ కొంతమంది మలయాళ హీరోయిన్లను కలుసుకుని, ముకుందన్‌ను వివాహం చేసుకోమని అడిగేవాడు, అందుకే నాకు, విపిన్‌కు మధ్య విభేదాలు వచ్చాయి. 2018లో, ఆ వ్యక్తి తన బ్యానర్‌లో సినిమా నిర్మించాలనే ఆలోచనను నాకు పరిచయం చేశాడు. మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ స్టార్ నటులకు తాను పీఆర్ హ్యాండిల్ అని అతను చెప్పుకుంటున్నాడు. అంతేకాద సినిమా పరిశ్రమలో నా గురించి చాలా గాసిప్‌లను వ్యాప్తి చేశాడు. దీని వల్ల నా వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో చాలా సమస్యలు తలెత్తాయి. ఈ వ్యక్తి కారణంగా, నేను కొంతమంది స్నేహితులను కోల్పోవలసి వచ్చింది, నా ఇమేజ్ దెబ్బతింది. కొన్ని సినిమాలు కూడా నా చేతుల్లోంచి జారిపోయాయి’ అని ఉన్ని ముకుందన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

హీరోయిన్లను పెళ్లి చేసుకోవాలంటూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.