Prithviraj Sukumaran: హీరోయిన్స్‌ను హీరోలే సెలక్ట్ చేయాలి.. పృథ్వీరాజ్‌ ఆసక్తికర కామెంట్స్

|

Mar 14, 2025 | 6:41 PM

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.. సలార్ సినిమాతో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో డార్లింగ్ ఫ్రెండ్ గా నటించి మెప్పించారు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు దర్శకుడిగా సినిమాలు చేస్తున్నారు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.

Prithviraj Sukumaran: హీరోయిన్స్‌ను హీరోలే సెలక్ట్ చేయాలి.. పృథ్వీరాజ్‌ ఆసక్తికర కామెంట్స్
Prithviraj Sukumaran
Follow us on

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అక్కడ సూపర్ హిట్స్ లో నటించారు పృథ్వీరాజ్‌. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు పృథ్వీరాజ్‌. సలార్ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించి మెప్పించారు పృథ్వీరాజ్‌. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఇప్పుడు పృథ్వీరాజ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా పృథ్వీరాజ్‌ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. హీరోయిన్స్ ను హీరోలో ఎంచుకోవాలని అన్నారు పృథ్వీరాజ్‌.

మహేష్ బాబు సినిమాతో పాటు.. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న L2: ఎంపురాన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు పృథ్వీరాజ్‌. సినిమాలకు నటీనటుల ఎంపిక గురించి పృథ్వీరాజ్ చేసిన గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో హీరోయిన్స్  ను హీరోలు ఎందుకు ఎంచుకోవాలో పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. హీరో అనేవాడు అన్ని పాత్రల ఎంపికలలో అంటే హీరోయిన్ మాత్రమే కాదు, చిన్న పాత్రల ఎంపికలో కూడా తన అభిప్రాయాన్ని చెప్పాలని ఆయన అన్నారు.

ఒక సినిమాలో దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్‌తో పాటు హీరో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడని ఆయన ఇంటర్వ్యూలో అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఒక సినిమా విజయం సాధించినా లేదా ఫ్లాప్ అయినా.. బాధ్యత వహించాల్సిన ఏకైక నటుడు అందులో ప్రధాన పాత్ర పోషించే వ్యక్తి మాత్రమే. కాబట్టి అతని అభిప్రాయం ముఖ్యం అని ఆయన అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.  ఇదిలా ఉండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్ సీక్వెల్, L2: ఎంపురాన్ మార్చి 27న థియేటర్లలోకి రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..