AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagabandham: ఇదెక్కడి ట్విస్ట్ రా మావ.. నాగబంధంలో ఆ సీన్స్ కట్.. రన్ టైమ్ తగ్గించిన మూవీ మేకర్స్

‘పెదకాపు’ ఫేమ్ విరాట్‌ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కించిన చిత్రం ‘నాగబంధం’. ఈ సినిమాను అభిషేక్‌ నామా తెరకెక్కించారు.. అత్యంత భారీగా విజువల్ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా జులై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.

Nagabandham: ఇదెక్కడి ట్విస్ట్ రా మావ.. నాగబంధంలో ఆ సీన్స్ కట్.. రన్ టైమ్ తగ్గించిన మూవీ మేకర్స్
Nagabandham Movie
Rajeev Rayala
|

Updated on: Jul 05, 2026 | 11:48 AM

Share

యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో అందాల భామలు నభా నటేష్, ఐశ్వర్య మీనన్ తో పాటు జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మొదటి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే ఓపినింగ్స్ కూడా భారీగానే రాబట్టింది నాగబంధం సినిమా.

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. టీజర్‌, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను 3 గంటల 16 నిమిషాల నిడివితో విడుదల చేశారు. దాంతో సినిమా చూసిన ఆడియన్స్ సినిమాలో ల్యాగ్ ఎక్కువైందని ఫీల్ అవుతున్నారు. దాంతో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను కట్ చేశారు మేకర్స్. దాదాపు దాదాపు 31 నిమిషాల నిడివిని ట్రిమ్ చేస్తూ ఎడిటింగ్ రూమ్‌లో సరికొత్తగా కట్ చేశారని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

దాంతో నాగబంధం సినిమా ఇప్పుడు సరికొత్త రన్ టైంతో ప్రేక్షకులను అలరిస్తుంది. 31 నిముషాలు కట్ చేసిన తర్వాత ఇప్పుడు సినిమా 2గంటల 45 నిమిషాలకు తగ్గించారు. ఈ క్రేజీ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దాంతో ట్రిమ్ చేసిన సినిమా సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని చిత్ర బృందం చెప్తుంది. మరి ఈ సినిమా కలెక్షన్స్ కూడా పెరుగుతాయేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి1857679,1857667,1857722,1857529

Follow Us