సంక్రాంతి సీజన్‌ని గ్రాండ్‌గా ఫినిష్ చేసుకున్న క్రాక్… ప్రీ సమ్మర్ సీజన్‌లో బొమ్మాడించిన వకీల్‌సాబ్… పరిశ్రమకు టానిక్‌లా పనిచేశాయి. ఇక మన సినిమాలకు తిరుగులేదనుకునే లోగా… సెకండ్ వేవ్ ముంచుకొచ్చి.. సడన్ బ్రేకులేసింది. ఆ తర్వాత తెరపినిచ్చి.. బిగ్ స్క్రీన్స్ ఓపెనయ్యాక్కూడా.. హెల్ది ఎట్మాస్పియరే కనిపించింది. కొత్త హీరో కిరణ్ అబ్బవరం చేసిన ఎస్‌ఆర్ కల్యాణమండపం… కటిక పరిస్థితుల్లో కూడా కాసింత కనకవర్షాన్ని చవిచూసింది. తర్వాత పాగల్ లాంటివి తిరగబడ్డా… శ్రీవిష్ణు రాజరాజ చోర కూడా బెటర్ రిజల్ట్‌ని ఎంజాయ్ చేసింది. లేటెస్ట్‌గా సుధీర్‌బాబు మూవీ శ్రీదేవి సోడా సెంటర్ సైలెంట్ హిట్ అనిపించుకుని… బిగ్ స్క్రీన్స్ మీద బిగ్ హోప్స్ క్రియేట్ చేస్తోంది. అయినా…. కొంతమంది మేకర్స్‌కి గుండెధైర్యం సరిపోలేదు.
పూర్తయిన సొంత సినిమాల్ని కూడా రిలీజ్‌కివ్వకుండా బీరువాలో దాచిపెట్టుకున్న దగ్గుబాటి కాంపౌండ్‌ది ఒక దారి. అటోఇటో ఎటోవైపు అనే చిన్నపాటి క్లారిటీతో వుంది దిల్ రాజు క్యాంప్. థియేటర్ల ఆరోగ్యం మేం ఆశించినంత భేషుగ్గా ఏమీ లేదు అంటూ లవ్‌స్టోరీ మేకర్స్ సడన్‌గా వెనకడుగేశారు. అదే ప్లేస్‌లో జబర్దస్త్‌గా ఖర్చీఫ్ వేసుకుంది సీటీమార్ టీమ్. వాళ్లకు లేని ఆడియన్స్ వీళ్లకెక్కడినుంచి వస్తారు… అనే ధర్మసందేహం వాళ్లదీ మనదీ అందరిదీనూ. ఈ హైటైమ్ నుంచి బైటపడ్డానికేనన్నట్టు మెగాస్టార్ ముందడుగేశారు. నాలుగో తేదీ జరిగే చిరంజీవి.. ఏపీ సీఎం భేటీ… కొన్ని సమస్యలకు ఫుల్‌స్టాప్ పెట్టబోతోంది.
ఏపీలో యాభై దగ్గరే ఆగిన ఆక్యుపెన్సీ రేపటిరోజున వందకు పెరిగినా పెరగొచ్చు. టిక్కెట్ రేట్లు పెంచుకునే లక్కీ ఛాన్స్ కూడా దొరకొచ్చు. పెండింగ్‌లో వున్న ఆచార్య, అఖండ లాంటి కొన్ని పెద్ద సినిమాలక్కూడా దారి కనిపించొచ్చు. ఇంతకీ.. పరిస్థితిని ఎప్పటికప్పుడు తీక్షణంగా గమనిస్తూ వస్తున్న ట్రిపులార్ మేకర్ జక్కన్న ఏం ఆలోచిస్తున్నారు… ఆయన తీసుకునే నిర్ణయం కోసమే టోటల్ ఇండస్ట్రీ వెరీ క్యూరియస్‌గా వెయిట్ చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :