అజయ్‌దేవగణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ ‘మైదాన్’. ఫుట్‌బాల్‌కి విపరీతమైన క్రేజ్ ఉన్న 1952-62 మధ్య కాలానికి సంబంధించిన స్టోరీతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాని 2021 ఆగస్టు 13న రిలీజ్ చేస్తున్నట్టు ట్విటర్ ద్వారా ప్రకటించారు అజయ్‌దేవగణ్. ”ఇప్పటి వరకూ వెండితెరపై చూడనిది..ప్రతి ఇండియన్ గర్వపడే స్టోరీ ఇది. ఆగస్టు 13వ తేదీని గుర్తుపెట్టుకోండి”అని ట్వీట్ చేశారు అజయ్.
‘బదాయి హో’ డైరెక్టర్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
2021 Independence week. An untold story that will make every Indian proud. 13th August mark the date. #Maidaan2021@priyamani6 @raogajraj @BoneyKapoor @iAmitRSharma @freshlimefilms @SaiwynQ @ActorRudranil @writish @saregamaglobal @ZeeStudios_ @ZeeStudiosInt pic.twitter.com/we6JPgu2Ui
— Ajay Devgn (@ajaydevgn) July 4, 2020
కాగా గాల్వాన్‌లోయ ఘటన భారత్- చైనాల మధ్య హై టెన్షన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో కూడిన కథ వెండితెరకు రాబోతుంది. అజయ్‌దేవగణ్ నిర్మించనున్న ఈ మూవీని దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారతీయ జవాన్లకు అంకితం ఇవ్వబోతున్నారు. నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు ఇంకా ఖరారు కాలేదు.