టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా ఈ మూవీ రానుంది. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు మహేష్. దాంతో ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఈ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు థియటర్స్ లో విజయం సాధించపోయినా.. టీవీలో మాత్రం మంచి విజయాలుగా నిలిచాయి. ఈ రెండు సినిమాలు టీవీల్లో వస్తే ఇప్పటికీ ప్రేక్షకులు వదిలిపెట్టారు. ఇక ఇప్పుడు మహేష్ కోసం త్రివిక్రమ్ ఓ పవర్ ఫుల్ కథను రెడీ చేశారని తెలుస్తోంది.ఈ ప్రాజెక్ట్ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ నిర్మించబోతున్నారు. రెండు నెలల క్రితం లాంఛనంగా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. దాదాపు 11 ఏళ్ల విరామం తరువాత త్రివిక్రమ్ – మహేష్ కలిసి సినిమా చేయాడంతో ఈ మూవీ పై భారీగా బజ్ క్రియేట్ అయ్యింది. అంతే కాదు ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.
అయితే త్రివిక్రమ్ సినిమాలకు ప్రత్యేకంగా ఓ రైటర్స్ టీమ్ వర్క్ చేస్తూ వుంటుంది అన్న విషయం తెలిసిందే. టీమ్ వర్క్ తో పాటు త్రివిక్రమ్ సొంతం గానే డైలాగ్ వెర్షన్ ని పూర్తి చేస్తుంటారు. అయితే తాజాగా తన టీమ్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట గురూజీ. కొంతమంది యంగ్ రైటర్స్ ఫైనల్ డ్రాఫ్ట్ ని సిద్ధం చేసి త్రివిక్రమ్ కి అందించారట. స్క్రిప్ట్ నచ్చడంతో త్రివిక్రమ్ ఆ స్క్రిప్ట్ కి స్క్రీన్ ప్లే డైలాగ్స్ ని రెడీ చేశారట. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి (12 )నుంచి జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..