Mahesh Babu-Krishna: అభిమానులను కన్నీళ్లు పెట్టిస్తోన్న మహేష్ మాటలు.. సూపర్ స్టార్ మదిలో అంతులేని విషాదం..

|

Nov 16, 2022 | 8:41 AM

సూపర్ స్టార్‏ కు నివాళి అర్పిస్తున్నారు సినీ ప్రముఖులు.. ఆయనకు గౌరవ సూచకంగా ఈరోజు తెలుగు సినీ పరిశ్రమకు సెలవు ప్రకటించారు. అందులో మహేష్ మాట్లాడిన మాటలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి.

Mahesh Babu-Krishna: అభిమానులను కన్నీళ్లు పెట్టిస్తోన్న మహేష్ మాటలు.. సూపర్ స్టార్ మదిలో అంతులేని విషాదం..
Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తమ ఫేవరేట్ హీరో మృతితో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. తమ హీరోను చివరిసారిగా చూసేందుకు ఆయన ఇంటి దగ్గర రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి అభిమానుల సందర్శనార్ధం పద్మాలయా స్టూడియోకి కృష్ణ భౌతికకాయం తీసుకువచ్చారు. ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అభిమానులు సందర్శించుకునేలా ఏర్పాటు చేశారు. 12గంటల తరువాత మహా ప్రస్ధానంలో అంత్యక్రియులు జరగనున్నాయి. సీనియర్ సూపర్ స్టార్‏ కు నివాళి అర్పిస్తున్నారు సినీ ప్రముఖులు.. ఆయనకు గౌరవ సూచకంగా ఈరోజు తెలుగు సినీ పరిశ్రమకు సెలవు ప్రకటించారు.

కృష్ణ మృతితో సినీ ప్రపంచం మూగబోయింది. అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన నట ప్రస్థానం గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో మహేష్ మాట్లాడిన మాటలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి.

ఇటీవల విడదలైన మేజర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో కృష్ణ బయోపిక్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందా ?… ఒకవేళ తీస్తే ఎప్పుడు వస్తుంది ? అంటూ రిపోర్టర్ ప్రశ్నించగా.. మహేష్ మాట్లాడుతూ.. నాన్నగారి బయోపిక్ ఎవరైనా చేస్తే మొదట చూడటానికి తానే ముందుంటాను అని.. తను మాత్రం ఆయన బయోపిక్ చేయలేనని.. ఆయన నా దేవుడు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే కృష్ణ తనయుడిగా జన్మించడం అదృష్టం అని.. ఆయన తన భవిష్యత్తును ఎంతో అందంగా తీర్చిదిద్దారని మరో వీడియోలో చెప్పుకొచ్చారు మహేష్. ప్రస్తుతం మహేష్ పాత ఇంటర్వ్యూలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఏడాది మహేష్ జీవితంలోనే అత్యంత విషాదాన్ని నింపింది. ముందుగా జనవరిలో అన్నయ్య రమేష్ బాబు మరణించగా.. సెప్టెంబర్ ‏లో తల్లి ఇందిరా దేవి మరణించారు. తల్లి.. అన్నయ్య దూరం కావడంతో ఇప్పటికే తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన మహేష్‏కు ఇప్పుడు తండ్రి కృష్ణ కూడా దూరమయ్యారు. నెలల వ్యవధిలోనే అన్నయ్య.. తల్లి… తండ్రి.. మహేష్‏ను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. దీంతో సోషల్ మీడియా వేదికగా మహేష్ కు సపోర్ట్ గా ఉంటున్నారు అభిమానులు. స్టే స్ట్రాంగ్ మహేష్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.