Mahesh Babu: కమల్‌ హాసన్‌ చేతుల మీదుగా కృష్ణ విగ్రహావిష్కరణ.. హీరో మహేష్‌ బాబు ఏమన్నారంటే?

దివంగత సూపర్‌ స్టార్‌, నట శేఖర కృష్ణ విగ్రహావిష్కరణ విజయవాడలో ఘనంగా జరిగింది. అశేష అభిమానుల సమక్షంలో లోకనాయకుడు కమల్‌ హాసన్‌ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వైసీపీ నాయకులు దేవినేని అవినాష్ కూడా పాల్గొన్నారు. కృష్ణ విగ్రహావిష్కరణ తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని కమల్‌ హాసన్‌ తెలిపారు. తండ్రి కృష్ణ విగ్రహావిష్కరణపై హీరో మహేశ్‌ బాబు స్పందించారు

Mahesh Babu: కమల్‌ హాసన్‌ చేతుల మీదుగా కృష్ణ విగ్రహావిష్కరణ.. హీరో మహేష్‌ బాబు ఏమన్నారంటే?
Mahesh Babu

Updated on: Nov 10, 2023 | 5:13 PM

దివంగత సూపర్‌ స్టార్‌, నట శేఖర కృష్ణ విగ్రహావిష్కరణ విజయవాడలో ఘనంగా జరిగింది. అశేష అభిమానుల సమక్షంలో లోకనాయకుడు కమల్‌ హాసన్‌ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వైసీపీ నాయకులు దేవినేని అవినాష్ కూడా పాల్గొన్నారు. కృష్ణ విగ్రహావిష్కరణ తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని కమల్‌ హాసన్‌ తెలిపారు. తండ్రి కృష్ణ విగ్రహావిష్కరణపై హీరో మహేశ్‌ బాబు స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా కమల్ హాసన్‌, దేవినేని అవినాష్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘విజయవాడలో నాన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్‌ హాసన్‌ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నాన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా గర్వ కారణం. నాన్న వదిలి వెళ్లిన జ్ఞాపకాలు, వారసత్వానికి ఇదొక నివాళి అనుకుంటున్నా. ఈ అద్భుతమైన కార్యక్రమంలో కమల్‌ హాసన్‌ గారు భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉంది. నాన్న విగ్రహం ఏర్పాటు చేయడానికి కారణమైన అందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా’ అని ట్వీట్‌ చేశారు మహేశ్‌ బాబు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్‌ రాజ్‌, సునీల్‌, బ్రహ్మానందం, మహేష్‌ అచంట, రఘు బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్స్‌ ఓ రేంజ్‌లో సెన్సేషన్‌ క్రియేట్ చేశాయి. చాలా భాగం షూటింగ్‌ పూర్తి చేసుకున్న గుంటూరు కారం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానుంది. థమన్‌ మహేష్‌ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మహేశ్ బాబు పోస్ట్..

భారీగా హాజరైన అభిమానులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.