AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: ట్రెక్కింగ్, ట్రైనింగ్ బ్లాక్ ఫారెస్ట్‌లో మహేష్ బాబు.. వారణాసి కోసం సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వారణాసి అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కుతుంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కితున్నారు రాజమౌళి .

Mahesh Babu: ట్రెక్కింగ్, ట్రైనింగ్ బ్లాక్ ఫారెస్ట్‌లో మహేష్ బాబు.. వారణాసి కోసం సూపర్ స్టార్
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: May 02, 2026 | 11:55 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సినిమా కోసం అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా రాకపోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ లెవల్ లో ఉండబోతుంది. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా.. తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకెళ్లేలా.. ప్రపంచం మొత్తం మన సినిమా వైపే చూసేలా వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న వారణాసిలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటించనున్నాడు.

ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా

అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. అంతే కాదు రకరకాల గెటప్స్ లో మహేష్ కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే మహేష్ బాబు రాముడిగా కనిపించనున్నారని రాజమౌళి లీక్ చేశారు. దాంతో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ మధ్య వారణాసి సినిమా అనౌన్స్ మెంట్ వీడియో విడుదల చేశారు రాజమౌళి. ఆ టీజర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వారణాసి టీమ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు రాజమౌళి.

ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!

దాంతో మహేష్ విదేశాలకు వెళ్లిపోయారు. అయితే తాజాగా మహేష్ బాబు షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం మహేష్ బాబు జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లో ఉన్నారు. ఫిట్‌నెస్, వెల్‌నెస్ నిపుణులు డాక్టర్ హ్యారీ కోనిగ్ తో కలిసి బ్లాక్ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ చేస్తున్నారు మహేష్ బాబు. సినిమాలో యాక్షన్ సీన్స్ , అడ్వాంచర్ సీన్స్ కోసం మహేష్ శిక్షణ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే  బ్లాక్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ చేస్తున్నారు. ట్రెక్కింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటూ వారణాసి కోసం సిద్ధమవుతున్నట్లు క్యాప్షన్‌ పెట్టారు.దాంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మహేష్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంట్లో మనశ్శాంతి లేదా?.. రాక్ సాల్ట్‌తో ఇలా చేయండి
ఇంట్లో మనశ్శాంతి లేదా?.. రాక్ సాల్ట్‌తో ఇలా చేయండి
పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్..
పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్..
మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు
మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు
మొదటిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఇవి తప్పక తెలుసుకోండి
మొదటిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఇవి తప్పక తెలుసుకోండి
పక్కా కొలతలతో రవ్వ లడ్డు.. తిన్న వాళ్ళు మెచ్చుకోవాల్సిందే
పక్కా కొలతలతో రవ్వ లడ్డు.. తిన్న వాళ్ళు మెచ్చుకోవాల్సిందే
పుష్యరాగం ధరించాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తప్పనిసరిగా..
పుష్యరాగం ధరించాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తప్పనిసరిగా..
బిలియన్ డాలర్ల సారీ..! ఇండియాతో ఎందుకీ తొండాట?
బిలియన్ డాలర్ల సారీ..! ఇండియాతో ఎందుకీ తొండాట?
రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా.. సీక్రెట్ టిప్‌తో ఇలా చేయండి
రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా.. సీక్రెట్ టిప్‌తో ఇలా చేయండి
అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్: జబర్దస్త్ నటుడి భార్య
అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్: జబర్దస్త్ నటుడి భార్య
వేగంగా బరువు తగ్గుతున్నారా? ఆకలి తగ్గిపోతోందా? అస్సలు నిర్లక్ష్యం
వేగంగా బరువు తగ్గుతున్నారా? ఆకలి తగ్గిపోతోందా? అస్సలు నిర్లక్ష్యం