Mahesh Babu: మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన విజయేంద్ర ప్రసాద్

రాజమౌళి కెప్టెన్సీలో భారీ అడ్వంచరస్ థ్రిల్లర్‌లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే అఫీషియల్‌గా ఎనౌన్స్‌ అయిన ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇంకా సెట్స్ మీదకు కూడా రాకపోయినా మహేష్ - రాజమౌళి సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu: మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన విజయేంద్ర ప్రసాద్
Mahesh Babu, Rajamouli

Updated on: May 19, 2023 | 10:12 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో పటు మహేష్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.. రాజమౌళి కెప్టెన్సీలో భారీ అడ్వంచరస్ థ్రిల్లర్‌లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే అఫీషియల్‌గా ఎనౌన్స్‌ అయిన ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇంకా సెట్స్ మీదకు కూడా రాకపోయినా మహేష్ – రాజమౌళి సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ హనుమంతుడి తరహాలో ఉంటుందన్నది ఓ న్యూస్‌. హీరోయిన్‌ జాన్వీ అని కూడా మరో న్యూస్‌ వైరల్‌ అవుతోంది. అయితే అదంతా గాసిప్పేనన్నది రాజమౌళి కాంపౌండ్‌ నుంచి వినిపిస్తున్న మాట.

విజయేంద్రప్రసాద్ ఈ మూవీకి కథ అందిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ని కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీని పై క్లారిటీ ఇచ్చారు విజయేంద్రప్రసాద్.

తాజాగా ఆయన .ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  వచ్చే ఏడాది వేసవి కంటే ముందే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే షూటింగ్ ఉంటుందని అన్నారు. ప్రస్తుతం రాజమౌళి క్యాస్టింగ్ సెలక్షన్ పనిలో ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ మూవీ కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి మూవీ వర్క్ షాప్ లో జాయిన్ అవ్వనున్నారు సూపర్ స్టార్..