Namrata Shirodkar: మంచి మనసు చాటుకున్న మహేశ్‌ సతీమణి.. మేకప్‌ ఆర్టిస్ట్‌ కుటుంబానికి అండగా నిలిచిన నమ్రత

|

Feb 12, 2023 | 3:25 PM

సామాజిక సేవలో భర్తతో కలిసి అడుగులేస్తోన్న నమత్ర తాజాగా మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకుంది. ఇంటి పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న ఓ కుటుంబానికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. పట్టాభి అనే మేకప్‌ ఆర్టిస్ట్‌ ఎంతో కాలంగా మహేశ్‌ దగ్గర పనిచేస్తున్నాడు

Namrata Shirodkar: మంచి మనసు చాటుకున్న మహేశ్‌ సతీమణి.. మేకప్‌ ఆర్టిస్ట్‌ కుటుంబానికి అండగా నిలిచిన నమ్రత
Namrata Shirodkar
Follow us on

టాలీవుడ్‌లో ది మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్స్‌లో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు- నమత్రా శిరోద్కర్‌ జోడీ ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఆన్యోన్య దాంపత్యానికి కేరాఫ్‌గా నిలిచారు. ప్రస్తుతం సినిమాల్లో మహేశ్‌ బిజీగా ఉంటుంటే, నమ్రత పిల్లల బాధ్యతలు, ఇంటి పనులు చూసుకుంటోంది. అలాగే మహేశ్‌ సినిమా, బిజినెస్‌ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటోంది. ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు మహేశ్‌- నమ్రత దంపతులు. ఓ ఫౌండేషన్‌ను నెలకొల్పి హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 1000 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపారీ లవ్లీ కపుల్‌. ఈక్రమంలో సామాజిక సేవలో భర్తతో కలిసి అడుగులేస్తోన్న నమత్ర తాజాగా మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకుంది. ఇంటి పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న ఓ కుటుంబానికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. పట్టాభి అనే మేకప్‌ ఆర్టిస్ట్‌ ఎంతో కాలంగా మహేశ్‌ దగ్గర పనిచేస్తున్నాడు. పర్సనల్‌ మేకప్‌ ఆర్టిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దీంతో మహేశ్‌ కుటుంబంతో పట్టాభికి ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.


కాగా శనివారం ఉదయం పట్టాభి తండ్రి హఠాన్మరణం పాలయ్యారు . ఈ వార్త తెలుసుకున్న మహేశ్‌ భార్య నమ్రత స్వయంగా వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కాగా ప్రస్తుతం ఓ సినిమా కోసం స్పెయిన్‌ పర్యటనలో ఉన్నాడు. అందుకే నమ్రతానే స్వయంగా వెళ్లి మేకప్‌ ఆర్టిస్ట్‌ కుటుంబాన్ని పరామర్శించింది.