Mahesh Babu: మరో మహత్తర కార్యక్రమం చేపట్టిన మహేష్ బాబు.. తండ్రి పుట్టినరోజున తనయుడి దత్తత గ్రామంలో..

SuperStar Krishna Birth Day: సూపర్ స్టార్ మహేష్.. కేవలం సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‏లోనూ హీరో అనిపించుకుంటున్నాడు.

Mahesh Babu: మరో మహత్తర కార్యక్రమం చేపట్టిన మహేష్ బాబు.. తండ్రి పుట్టినరోజున తనయుడి దత్తత గ్రామంలో..
Vaccination

Updated on: May 31, 2021 | 5:32 PM

SuperStar Krishna Birth Day: సూపర్ స్టార్ మహేష్.. కేవలం సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‏లోనూ హీరో అనిపించుకుంటున్నాడు. ఇప్పటికే ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తూ.. చాలా మంది పిల్లలకు ఊపిరి పోశాడు మహేష్ బాబు. అయితే ఇప్పుడు మరో మహత్తర కార్యక్రమం చేపట్టాడు. ఈరోజు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు (మే 31) కావడంతో మరోసారి సామాజిక సేవ చేస్తున్నాడు.

Mahesh Babu

ఆంధ్రప్రదేశ్ లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపూర్ గ్రామాలను మహేష్ బాబు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు తన తండ్రి పుట్టినరోజు కావడంతో.. ఆంధ్ర హాస్పిటల్స్ సహాకారంతో బుర్రిపాలెం గ్రామస్తులు కోవిడ్ -19 టీకాల పూర్తి డ్రైవ్ ను స్పాన్సర్ చేశారు. ఇప్పటికే తన తండ్రికి ఎంతో ప్రేమగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపిన మహేష్.. ఈ ప్రత్యేకమైన రోజున ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ సాధించిన తర్వాతా.. గ్రామ దత్తత అనే అంశం ప్రధానంగా వినిపించడంతో.. ఆ సమయంలోనే మహేష్ బాబు.. ఈ రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాలు పంచుకొంటూ తన సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా హీరో సుధీర్ బాబు ఇంట్లో జరిపించారు.

Also Read: PF Clients Alert : పీఎఫ్ ఖాతాదారులు అలర్ట్..! జూన్ 1 నుంచి కొత్త నియమాల అమలు.. ఇది చేయకపోతే మీ ఖాతా ఔట్..

Smoking Corona: మీరు స్మోక్ చేస్తారా.? వెంట‌నే మానేయండి.. క‌రోనా స‌మయంలో ఇది చాలా డేంజ‌ర్‌.. మ‌ర‌ణం సంభవించే ఛాన్స్‌..

TS Medical Colleges : రాష్ట్రంలో ఏడు మెడికల్ కాలేజీలు , వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

Helplines : నాలుగు హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం, ప్రజలకు తెలియ పర్చాలని టీవీ ఛానళ్లకు వినతి