Mahesh Babu: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో! వారసుడి అరంగేట్రానికి ముహూర్తం ఫిక్స్ ! డైరెక్టర్ ఎవరంటే?

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడిగా సినిమాల్లో అదృష్టం పరీక్షించుకోనున్నాడు. త్వరలోనే ఈ కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఇప్పటికే కథ కూడా ఫిక్స్ అయ్యిందని, డైరెక్టర్, నిర్మాత కూడా ఫైనల్ అయ్యారని సమాచారం.

Mahesh Babu: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో! వారసుడి అరంగేట్రానికి ముహూర్తం ఫిక్స్ ! డైరెక్టర్ ఎవరంటే?
Mahesh Babu Family

Updated on: May 07, 2025 | 12:15 PM

ఘట్టమనేని ఫ్యామిలీలో ఇప్పటికే చాలామంది హీరోలు వచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేశ్ బాబు హీరో అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో మహేష్ కూడా ఒకడు. అయితే మహేష్ కంటే ముందు కృష్ణ పెద్ద కొడుకు, మహేశ్ కి అన్నయ్య అయిన రమేశ్ బాబు కూడా పలు సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేకపోయాడు. ఆ తర్వాత నిర్మాత గానూ మారాు. వ్యాపారాలు కూడాచూసుకున్నారు. కొన్నేళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూశారు. అయితే రమేశ్ బాబుకి జయకృష్ణ అని ఓ కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయినే హీరోగా లాంచ్ చేసే ప్లాన్ లో మహేశ్ బాబు ఉన్నాడని తెలుస్తోంది. జయకృష్ణ డెబ్యూ కోసం ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ సినిమాల ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతిని తీసుకున్నారని సమాచారం.

ఇక మహేశ్ బాబుని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత అశ్వనీదత్ జయకృష్ణని కూడా హీరోగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. జయకృష్ణ కోసం కథ కూడా రెడీగా ఉందని సమచారం. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు విరామం ప్రకటించడంతో జయకృష్ణ లాంఛింగ్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడట మహేష్.

జయకృష్ణ లేటెస్ట్ ఫొటోస్..

మహేష్, రమేష్ బాబులతో పాటు కృష్ణ కుమార్తె మంజుల కూడా సినిమాల్లో సత్తా చాటింది. నటిగా, నిర్మాతగా తన ట్యాలెంట్ చూపించింది. ఇక మంజుల భర్త సంజయ్ స్వరూప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. ఇక మహేశ్‌ బాబు బావమరిది సుధీర్ బాబు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అలాగే మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ కూడ హీరోగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. మరికొన్ని రోజులు ఆగితే మహేశ్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితార కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.

జయకృష్ణ డెబ్యూపై మహేష్ స్పెషల్ కేర్..

Mahesh Babu

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి