Mahesh Babu: సింహం సిద్దమైంది.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. చాలా కాలంగా ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. చివరిసారిగా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్.. ఇప్పుడు పూర్తిగా రాజమౌళి సినిమా కోసమే టైమ్ కేటాయించారు. కొన్ని నెలలుగా ఈ మూవీ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. అలాగే అటు తన లుక్ సైతం మార్చేశారు.

Mahesh Babu: సింహం సిద్దమైంది.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..
Mahesh Babu

Updated on: Feb 28, 2025 | 12:12 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయం తర్వాత జక్కన మరోసారి భారీ బడ్జెట్ సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని టాక్. కొన్నాళ్లుగా ఈసినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు మహేష్ బాబు. అలాగే తన లుక్, మేకోవర్ పూర్తిగా మార్చేశారు. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్‏తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది.

అలాగే ఈ సినిమా ఆఫ్రికన్ అడవి నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. అసలు ఈ సినిమా ఎలా ఉంటుంది.? కథ ఏంటి.? అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమానుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా.. అని మహేష్ బాబు ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక మహేష్ బాబు ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదు. మహేష్ లుక్ ను హైడ్ చేస్తున్నారు. అయితే తాజాగా మహేష్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మహేష్ బాబు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మహేష్ బాబు లాంగ్ హెయిర్ లో అదరగొట్టాడు. సింహం సిద్ధం అవుతుందని మహేష్ బాబు ఫ్యాన్ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ బల్క్ గా మారుతున్నారు. జిమ్ లో వర్కౌట్స్ చేసి బాడీని పెంచుతున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.