
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. సూపర్ హిట్ టాక్ తో గుంటూరు కారం ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించి సక్సెస్ సాధించారు. మహేష్ బాబును మునుపెన్నడూ చూడని మాస్ లుక్ లో చూపించి ప్రేక్షకులను అలరించారు త్రివిక్రమ్. అంతే కాదు ఈ సినిమాలో మహేష్ బాబు తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, మాస్ డాన్స్ ఆడియన్స్ చేత థియేటర్స్ లో విజిల్స్ కొట్టించింది. గుంటూరు కారం సినిమాకు రోజు రోజుకు రెస్పాన్స్ పెరిగిపోతుంది. కలెక్షన్స్ పరంగాను దూసుకుపోతుంది గుంటూరు కారం. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.
ఇదిలా ఉంటే గుంటూరుకారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తుంది. సోషల్ మీడియా మొత్తాన్ని ఈ సాంగ్ షేక్ చేస్తుంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కంటిన్యూ అవుతుంది ఈ పాట. తాజాగా ఈ సాంగ్ 50 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది కుర్చీసాంగ్. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ డైలాగ్ ను ఇలా సాంగ్ గా డిజైన్ చేశారు తమన్ .
సో సో సో సోకులాడి స్వప్న సుందరి
మాపటేల మల్లె పందిరి
రచ్చరాజుకుందె ఊపిరి
గుండెలోన డీరి డిరి డిరి…… 🥁🥁🕺🕺The Massiest Feast #KurchiMadathaPetti keeps the celebrations going with 5️⃣0️⃣ Million+ Views and Trending #1 on YouTube ❤️❤️@urstrulyMahesh #Trivikram @sreeleela14… pic.twitter.com/edMFEcq6Hy
— Guntur Kaaram (@GunturKaaram) January 18, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.