సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 12 ఎల్లా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుంది. . ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అని కొంతమంది అంటుంటే మరికొందరు ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే మహేష్ ఈ సినిమాలో సాలిడ్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమానుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మేకర్స్ చెప్పినట్టుగా తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ బాబు సరికొత్త మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. పోస్టర్ ని బట్టి చూసే ఇది మిర్చి యార్డ్ లో జరిగే యాక్షన్ సన్నివేశమని అనిపిస్తోంది. మిర్చి యార్డ్ లో కొందరికి బుద్ధిచెప్పి.. కళ్లద్దాలు, నోట్లో సిగరెట్ తో గుంటూరు మిర్చి ఘాటుని తలపిస్తూ స్టైల్ గా నడిచొస్తున్న మహేష్ బాబు మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. మొత్తానికి వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి మాస్ బొమ్మ చూపించబోతున్నారని పోస్టర్ తోనే అర్థమవుతోంది.
మహేష్ బాబు సినిమాలకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాలను అందుకున్నాయి. ఇక దర్శకుడు త్రివిక్రమ్ గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ సైతం 2020 సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ రికార్డులను సృష్టించడం విశేషం. అసలే హ్యాట్రిక్ కాంబినేషన్, అందులోనూ సంక్రాంతి సీజన్ కావడంతో ‘ఎస్ఎస్ఎంబి 28’ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ మూవీ ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోండగా.. కీలకపాత్రలో శ్రీలీల కనిపించనుంది. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
13.01.2024!! #SaveTheDate https://t.co/hrAkrNRR2k
— Mahesh Babu (@urstrulyMahesh) March 26, 2023