Samantha: ‘కర్మ హిట్స్ బ్యాక్’.. సమంతను ఏకిపారేస్తున్న మహేష్ ఫ్యాన్స్.. ఎందుకంటే.?

| Edited By: Ravi Kiran

Jul 14, 2023 | 10:00 AM

కర్మ హిట్స్ బ్యాక్ అంటారు కదా.. ఇప్పుడు సమంత విషయంలో ఇదే జరుగుతుంది. ఎప్పుడో పదేళ్ళ కింద చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు బయటికి తీసుకొచ్చి..

Samantha: కర్మ హిట్స్ బ్యాక్.. సమంతను ఏకిపారేస్తున్న మహేష్ ఫ్యాన్స్.. ఎందుకంటే.?
Samantha
Follow us on

కర్మ హిట్స్ బ్యాక్ అంటారు కదా.. ఇప్పుడు సమంత విషయంలో ఇదే జరుగుతుంది. ఎప్పుడో పదేళ్ళ కింద చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అది కూడా అలాంటిలాంటి ట్రోలింగ్ కాదు.. నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యే మాస్ ట్రోలింగ్. అసలింతకీ సమంత ఏం ట్వీట్ చేసారు..? ఇప్పుడెందుకు అది ట్రెండ్ అవుతుంది..? అసలేంటి ఈ మ్యాటర్ అంతా..?

కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అనే సామెత సమంతకు బాగా సూట్ అవుతుందిప్పుడు. ఎప్పుడో ఏదో చేస్తే.. అది తిరిగి మనకే అప్లై అవుతుంది చూడు.. అదే జరుగుతుందిప్పుడు సమంత విషయంలో. పదేళ్ల కింద మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమా పోస్టర్ విషయంలో సమంత చేసిన ట్వీట్ ఒకటి బాగా వివాదాస్పదమైంది. ఓ పాటలో మహేష్ నడుస్తుంటే.. కాళ్ల దగ్గర కృతి సనన్ పాకుతూ ఉండటాన్ని తప్పు బట్టారు స్యామ్.

ఆడవాళ్లని కించపరిచారు అంటూ ఆ పోస్టర్ ట్వీట్ చేసారు సమంత. అప్పట్లో దీనిపై స్యామ్‌పైనే ఎక్కువగా కౌంటర్లు పడ్డాయి. అప్పట్నుంచి ఆ తరహా పోస్టర్ ఏదొచ్చినా.. వెంటనే సమంతను ట్యాగ్ చేయడం.. ట్రోల్ చేయడం అలవాటైపోయింది ఫ్యాన్స్‌కు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌, శ్రీమంతుడు లాంటి సినిమాల్లోనూ హీరోయిన్ కాలిని హీరోలు టచ్ చేసే సీన్స్ ఉంటాయి. వాటిని చూపించి సమంతను టార్గెట్ చేస్తున్నారు.

తాజాగా ఖుషీ సినిమాలో ఆరాధ్య సాంగ్ విడుదలైంది. ఈ పాటలో సమంత చేతిని విజయ్ దేవరకొండ కాలితో టచ్ చేస్తారు. ఆ ఫోటో బయటకు వచ్చిన వెంటనే సమంతను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు మహేష్‌ను విమర్శించారు కదా.. మరి ఈ రోజు మీరు చేసిందేంటి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి కర్మ హిట్స్ బ్యాక్ అంటే ఇదేనేమో..? ట్వీట్ చేసి పదేళ్లైనా ఇంకా పవర్ తగ్గలేదన్నమాట.