Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు షాక్ ఇచ్చిన లీకర్స్.. సోషల్ మీడియాలో మూవీ ఫైట్ సీన్..

ప్రిన్స్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు మరో సారి షాకిచ్చారు లీకర్స్. ఎంతో కష్టపడి మరీ.. న్యూమరికల్‌గా 9 వచ్చేలా టైం ఫిక్స్ చేసుకుని మరీ...

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు షాక్ ఇచ్చిన లీకర్స్.. సోషల్ మీడియాలో మూవీ ఫైట్ సీన్..
Mahesh Babu

Edited By: Anil kumar poka

Updated on: May 02, 2022 | 4:55 PM

ప్రిన్స్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు మరో సారి షాకిచ్చారు లీకర్స్. ఎంతో కష్టపడి మరీ.. న్యూమరికల్‌గా 9 వచ్చేలా టైం ఫిక్స్ చేసుకుని మరీ… సర్కారు వారి పాట ట్రైలర్, రిలీజ్ చేద్దామనుకున్నచిత్రయూనిట్ కు  దిమ్మ తిరిగేలా చేశారు. ట్రైలర్‌ను ముందే రిలీజ్ చేసేసి.. మహేష్ తో పాటు ఆయన టీంకు షాకిచ్చారు. సర్కారు అఫీషియల్ ట్రైలర్ రిలీజ్‌ కు ముందే ట్రైలర్ లోని కొన్ని షాట్లను సోషల్ మీడియాలో లీక్‌ చేశారు కొంతమంది లీకర్స్. మహేష్ తాళాల గుత్తితో ఫైట్ చేస్తున్న విజులవల్స్‌ను బయటికి వదిలారు. అయితే ఇది మానీటర్ లో ప్లే అవుతుంటే.. మొబైల్ తో రికార్డ్‌ చేసినట్టు కనిపిస్తుండడంతో.. లీకు వీరుడు సర్కారు వారి పాట టీంలో ఉన్నారనే డౌట్ అందరిలో కలుగుతోంది.

ఇక మహేష్ సర్కారు వారి పాట సినిమాకు లీకులు కొత్తేం కావు. మహేష్ వీడియోగ్లింప్స్‌ కూడా రిలీజ్‌ కంటే ముందే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. లిరికల్ సాంగ్స్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. (Source)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Satyajit Ray: భారతీయ సినిమాలో కొత్త ఒరవడి సృష్టించిన ప్రజ్ఞాశాలి సత్యజిత్‌రాయ్‌

Viral Photo: బూరె బుగ్గల చబ్బీ గర్ల్ ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్‏లోనే క్రేజీ హీరోయిన్..

Telugu Movies: ఈవారం మరింత ఎంటర్టైన్మెంట్.. థియేటర్లలో.. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..