SSMB28 Movie: మహేష్.. త్రివిక్రమ్ సినిమాపై క్రేజీ అప్డేట్.. టైటిల్ రిలీజ్ పై క్లారిటీ అప్పుడే ?…

|

May 17, 2022 | 8:33 AM

డైరెక్టర్ పరుశురామ్.. మహేష్.. కీర్తి కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

SSMB28 Movie: మహేష్.. త్రివిక్రమ్ సినిమాపై క్రేజీ అప్డేట్.. టైటిల్ రిలీజ్ పై క్లారిటీ అప్పుడే ?...
Ssmb 28
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది సర్కారు వారి పాట. డైరెక్టర్ పరుశురామ్.. మహేష్.. కీర్తి కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ మూవీ తర్వాత మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు.. కానీ ఇప్పటివరకు ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కాలేదు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

చాలా కాలం తర్వాత మహేష్.. త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ గురించి రోజుకో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి క్రేజీ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31న SSMB 28 టైటిల్ ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.. జూలైలో ఈ సినిమా సెట్స్ పైకీ వెళ్లనుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది.. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.