AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahakumbh 2025 : దశ తిరిగిందిరోయ్.. దండలు అమ్మిన తేనెకళ్ల సుందరికి సినిమా ఆఫర్.. హీరో ఎవరంటే..

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఓ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాటుక పెట్టిన తేనె కళ్లు.. డస్కీ స్కీన్.. అందమైన చిరునవ్వు.. చూడగానే కట్టిపడేసే అందంతో మహాకుంభమేళాకు వచ్చిన ప్రజలను మంత్రముగ్దులను చేసింది. దీంతో ఆ అమ్మాయి ఓవర్ నైట్ సెన్సెషన్ అయిపోయింది.

Mahakumbh 2025 : దశ తిరిగిందిరోయ్.. దండలు అమ్మిన తేనెకళ్ల సుందరికి సినిమా ఆఫర్.. హీరో ఎవరంటే..
Monalisa
Rajitha Chanti
|

Updated on: Jan 21, 2025 | 3:03 PM

Share

ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరలవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా నటనపై ఆసక్తి ఉండి సినీరంగంలోకి రావాలనుకునేవారికి ఎంతో ఉపయోగపడింది. సోషల్ మీడియాలో ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారలు చాలా మంది ఉన్నారు. నెట్టింట రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా చక్రం తిప్పుతున్న తారల గురించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. కాటు దిద్దిన అందమైన తేనె కళ్లు.. డస్కీ స్కీన్, సింపుల్ హెయిర్ స్టైల్ తో మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో దండలు అమ్ముకుంటున్న ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిన కొందరు.. వెంటనే తన ఫోటోస్ నెట్టింట షేర్ చేయడంతో చాలా ఫేమస్ అయిపోయింది.

ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన ఆ అమ్మాయి కుంభమేళాలో దండలు అమ్ముకోవడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది. అయితే ఆమె తేనెకళ్లు.. చూడచక్కని రూపం చూసి ఫిదా అయిన కొందరు ఆ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు మోనాలిసా రూపం పూర్తిగా మారిపోయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ అమ్మాయికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మోనాలిసా.. చిన్నప్పటి నుంచి దండలు అమ్ముతూ తన తల్లిదండ్రులకు సాయం చేస్తుంది. ఈ క్రమంలోనే కుంభమేళాలో తన కుటుంబంతో కలిసి దండలు విక్రయిస్తున్న ఆ అమ్మాయి నెట్టింట పాపులర్ కావడంతో ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ ఇచ్చారట. డైరెక్టర్ సనోజ్ మిశ్రా త్వరలోనే ఆ అమ్మాయిని కలవనున్నారని టాక్.

సనోజ్ మిశ్రా మాట్లాడుతూ.. మోనాలిసా రూపం.. ఆమె అమాయకత్వాన్ని చూసి తాను ఫిదా అయ్యాయని.. తనకు డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం ఇలాంటి అమ్మాయినే వెతుకుతున్నానని.. ఇందులో రైతు కూతురి పాత్ర కోసం మోనాలిసా సెట్ అవుతుందని.. త్వరలోనే ప్రయాగ్ రాజ్ వెళ్లి ఆమెను కలవనున్నట్లు తెలిపారు. మోనాలిసాకు యాక్టింగ్ నేర్పిస్తామని అన్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు అన్నయ్య అమిత్ రావు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు టాక్.

View this post on Instagram

A post shared by Kan Singh (@kanjivlogs)

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..