Sanoj Mishra: కుంభమేళా మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్.. ఎందుకంటే..

మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ తెనే కళ్లతో స్పెషల్ అట్రాక్షన్ అమ్మాయి మోనాలిసా. కొద్ది రోజుల్లోనే ఇన్ స్టాలో ఆమె ఫోటోస్, వీడియోస్ తెగ చక్కర్లు కొట్టాయి. సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన ఆమెకు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా. తాజాగా అతడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Sanoj Mishra: కుంభమేళా మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్.. ఎందుకంటే..
Monalisa, Sanoj Mishra

Updated on: Mar 31, 2025 | 2:49 PM

మహా కుంభమేళాలో పూసలు, రుద్రక్ష మాలలు అమ్మి సోషల్ మీడియాలో వైరల్ అయిన నిరుపేద అమ్మాయి మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే అతడి బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిందని.. దీంతో పోలీసులు సనోజ్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఝాన్సీకి చెందిన ఒక యువతిని సినిమాలో పాత్ర ఇప్పిస్తానని ప్రలోభపెట్టాడని దర్శకుడు సనోజ్ పై ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత సదరు అమ్మాయిని శారీరకంగా వేధించారని.. ఆమెను బెదిరింపులకు గురి చేస్తూ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం… 2020లో టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సనోజ్ మిశ్రాను కలిశానని..సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి ఎక్కువగా ఫోన్స్ చేసేవాడని.. ఆపై దర్శకుడు 17 జూన్ 2021న తనకు కాల్ చేసి ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో ఉన్నట్లు చెప్పాడాని.. తనను కలవడానికి రావాలని.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని బాధితురాలు పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది.

మరుసటి రోజు జూన్ 18, 2021న దర్శకుడు మళ్లీ ఫోన్ చేసి రైల్వే స్టేషన్‌కు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారని.. చేసేది లేక రైల్వే స్టేషన్ కు వెళ్తే.. తనను రిసార్ట్‌కు తీసుకెళ్లాడని.. ఆ పై మత్తు మందు ఇచ్చి తనపై దాడికి పాల్పడ్డాడని.. ఆపై అసభ్యకరమైన ఫోటోస్, వీడియోస్ తీసి బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై అనేకసార్లు దాడికి పాల్పడ్డారని.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పడంతో ముంబై వచ్చి అతడితోనే జీవించడం ప్రారంభించానని… చాలాసార్లు తనను కొట్టారని తెలిపింది. 2025 ఫిబ్రవరిలో తనను విడిచి పెట్టాడని.. ఫిర్యాదు చేస్తే తన అసభ్యకరమైన పోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఇదిలా ఉంటే సనోజ్ మిశ్రా కుంభమేళా మోనాలిసాకు ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలోని ఓ పాత్రకు ఆమెను ఎంపిక చేసుకున్నాడు.

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..