Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులు ఏం అంటున్నారంటే..

సినిమాలోని యాక్షన్ సీన్స్, డ్యాన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లిందంటూ ట్వీట్ చేస్తున్నారు. అలాగే వెన్నెల కిషోర్ కామెడి అదిరిపోయిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులు ఏం అంటున్నారంటే..
Nithiin

Updated on: Aug 12, 2022 | 9:10 AM

యంగ్ హీరో నితిన్ (Nithiin), కృతి శెట్టి జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam). డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు (ఆగస్ట్ 12)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో కేథరిన్ కీలకపాత్రలో నటించగా.. హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్‏లో అలరించింది. ముందు నుంచి ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే మాచర్ల నియోజకవర్గం ప్రివ్యూ చూసిన సినీ ప్రియుల తమ అభిప్రాయలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు.

ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్, డ్యాన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లిందంటూ ట్వీట్ చేస్తున్నారు. అలాగే వెన్నెల కిషోర్ కామెడి అదిరిపోయిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.