Thank You: యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya)రీసెంట్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల కథల విషయంలో జాగ్రత్తలు వహిస్తున్న చైతు ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన విక్రమ్ కుమార్ తో మరోసారి జతకట్టాడు. ఈ సినిమాకు థ్యాంక్యూ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. సక్సెస్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చైతన్యకు జోడీగా రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది.
టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం నుంచి మారో మారో అనే యూత్‌ఫుల్ కాలేజ్ సాంగ్ లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. యూత్‌ఫుల్ మాస్ కాలేజ్‌గా పాటగా చిత్రంలో వుండే ఈ సాంగ్‌కు సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందించగా, దీపు అండ్ ప్రదీప్ చంద్ర ఆలపించారు. ఈ క్యాచీ పాటకు విశ్వ అండ్ కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్ రవి కథను అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల జరుపుకుంటోంది. థ్యాంక్యూ సినిమాను జూలై 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలచేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి .