MAA Elections 2021: మా ఎన్నికల పూర్తి ఫలితాలు వచ్చేశాయి.. కొత్త కార్యవర్గం ఇదే..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పూర్తి ఫలితాలు వచ్చేశాయి. కాసేపటి క్రితమే ఎన్నికల అధికారి మా ఎన్నికల పూర్తి ఫలితాలను ప్రకటించారు. పాతికేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది...

MAA Elections 2021: మా ఎన్నికల పూర్తి ఫలితాలు వచ్చేశాయి.. కొత్త కార్యవర్గం ఇదే..
Maa Elections

Updated on: Oct 11, 2021 | 7:32 PM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పూర్తి ఫలితాలు వచ్చేశాయి. కాసేపటి క్రితమే ఎన్నికల అధికారి మా ఎన్నికల పూర్తి ఫలితాలను ప్రకటించారు. పాతికేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 72 శాతం పోలింగ్ నమోదైంది. అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచారు.

ఆయనకు 381 రాగా సమీప ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‎కు 274 ఓట్లు వచ్చాయి. దీంతో మంచు విష్ణు 107 ఓట్లతో విజయ ధుంధుభి మోగించారు. జనరల్ సెక్రటరీగా రఘుబాబు ఏడు ఓట్ల తేడాతో జీవితపై గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‎గా శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్‎గా మాదాల రవి, బెనర్జీ, కోశాధికారిగా శివబాలాజీ, జాయింట్ సెక్రెటరీలుగా గౌతం రాజు, ఉత్తేజ్ విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఎనిమిది మంది, విష్ణు ప్యానల్ నుంచి 10 మంది ఈసీ మెంబర్లుగా గెలుపొందారు. అందులో శివారెడ్డి అత్యధికంగా 362 ఓట్లు వచ్చాయి.

కార్యవర్గ సభ్యులు (మంచు విష్ణు ప్యానల్)
మాణిక్
హరినాథ్
బొప్పన విష్ణు
పసునూరి శ్రీనివాస్
శ్రీలక్ష్మి
జయవాణి
శశాంక్
పూజిత
కార్యవర్గ సభ్యులు (ప్రకాష్ రాజ్ ప్యానల్)
అనసూయ
సురేశ్ కొండేటి
కౌశిక్
శివారెడ్డి

Read Also.. MAA Reactions: ‘మా’ ఫలితాల తర్వాత రియాక్షన్లు.. లేదంటే, తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామంటూ హెచ్చరికలు