MAA Elections 2021: మా ఎన్నికలు ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెళ్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. రాజకీయ ఎన్నికల సమయంలో గొడవలు జరిగినట్లుగానే.. మా ఎన్నికల పోలింగ్ సమయంలోనూ ఘర్షణలకు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటలకు ముగియనుంది. సవాళ్లు, ప్రతి సవాళ్లు.. మాటల యుద్ధం, రాజకీయ నాయకులను మించిన ఆరోపణలు, వాగ్దానాలు.. ఇవీ గత కొన్ని రోజుల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో కనిపిస్తోన్న పరిస్థితి.
ఈ ఎన్నికల పోలింగ్ కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో కొనసాగుతోంది.
అయితే ఉదయం పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదానికి ప్రకాశ్ రాజ్ కారణమని మంచి విష్ణు ప్యానల్ ఆరోపణలు చేసింది. పోలింగ్ కేంద్రం వద్ద నరేష్‌తో గొడవపై ఆయన వివరణ ఇచ్చారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా.. ఇంట్లో కౌగిలికి ఎన్నో అర్థాలుంటాయని నవ్వుతూ చెప్పారు. వివాదానికి తానే కారణమని చెప్పడం నచ్చలేదని అన్నారు. పోలింగ్‌లో చిన్న పాటి వివాదాలు తలెత్తడం సహజమని చెప్పుకొచ్చారు. ఇక పోలింగ్ బూత్ లోకి ప్రకాశ్ రాజ్ గన్ మెన్లు రావడంతో విష్ణు అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలోనే నరేశ్, ప్రకాశ్ రాజ్ మధ్య గొడవ చోటు చేసుకుంది. ప్రస్తుతం సజావుగా సాగుతోన్న ఓటింగ్.. ఇప్పటి వరకు 56 శాతం పోలింగ్ నమోదైంది.మరి కొద్దిసేపట్లో పోలింగ్ ముగియనుంది. ఇక క్యూలో ఇంకా ఓటర్లు ఉండటంతో మరో గంట పాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు.