Naresh: నాగబాబు మాటలు నన్ను బాధించాయి.. ఆ మాట అనడం తప్పు.. ప్రెస్‏మీట్‏లో నరేష్…

|

Jun 26, 2021 | 12:35 PM

MAA Elections 2021: "మా" మసకబారిపోయింది అంటూ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని మా అధ్యక్షుడు నరేష్ అన్నారు.

Naresh: నాగబాబు మాటలు నన్ను బాధించాయి.. ఆ మాట అనడం తప్పు.. ప్రెస్‏మీట్‏లో నరేష్...
Naresh
Follow us on

MAA Elections 2021: “మా” మసకబారిపోయింది అంటూ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని మా అధ్యక్షుడు నరేష్ అన్నారు. నాగబాబు.. తనకు ఎంతోకాలం నుంచి మంచి స్నేహితుడని.. ‘మా’ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సినీ పెద్దలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చామని నరేష్ అన్నారు. శుక్రవారం ప్రకాశ్ రాజ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి కౌంటర్ గా శనివారం ఉదయం నరేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. “నాకు కథలు చెప్పడం అలవాటు లేదు. కాగితాలతో రావడం అలవాటు. ఎవర్నో దూషించడానికి… ఎవరిపైనో కాలు దువ్వడానికి ఈ సమావేశం పెట్టలేదు. మా అధ్యక్షుడిగా పోటీ చేయమని నన్ను ఎవరు అడగలేదు. నాకు ఎంతో ఆప్తులైన సీనియర్ నటి జయసుధకు అండగా ఉండాలని.. మా లో మార్పు తీసుకురావాలని ఎన్నికలకు వెళ్లాను. కానీ గడిచిన ఎన్నికలలో ఆమె ఓడిపోయారు. ఆ విషయం నన్ను తీవ్రంగా బాధించింది. జీవితంలో నువ్వు అధ్యక్షుడివి కాలేవు అన్నారు. కానీ ప్రెసిడెంట్ అయ్యి ఎన్నో అభివృద్ధి పనులు చేశాను” అని చెప్పారు నరేష్.

” ప్రకాష్ రాజ్ శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టారు. అది నేను తప్పు అనడం లేదు. కానీ ప్రస్తుతం జనరల్ బాడీలో ఉన్న సభ్యులే తమ పదవీ కాలం ముగియక ముందే ప్రకాష్ రాజ్ ప్యానల్లో చేరి.. నిన్న జరిగిన సమావేశంలో కనిపించడం చూసి షాకయ్యాను. అదే సమావేశంలో నటుడు నాగబాబు మాట్లాడుతూ.. మా మసకబారిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ఆయన నాకు ఆప్త మిత్రుడు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ప్రతి విషయం పెద్దలకు చెప్పాను. అలాంటిది నాగబాబు ‘మా ‘ మసకబారిందని వ్యాఖ్యనించడం తప్పు.. ఆ మాటలు నన్ను బాధించాయి” అని నరేష్ అన్నారు.

అనంతరం నటి కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. “ఆడవాళ్ల మీద గౌరవం లేని వాళ్లకు మేము ఎప్పటికీ సపోర్ట్ చేయమని.. ప్రకాష్ రాజ్ స్త్రీలకు మర్యాద ఇవ్వడని.. అందుకు తనే ప్రత్యేక్ష సాక్షిని అని.. బాధితురాలని కూడా అన్నారు. మహిళల్ని గౌరవించని వ్యక్తి మా లోకి వస్తాం అంటే ఎలా ఒప్పుకుంటాం” అన్నారు.

వీడియో..

Also Read: Corona Delta Plus: తిరుపతిలో డెల్టా ప్లస్ వేరియంట్‌‌ తొలి కేసు.. అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్.. స్థానికుల నమూనాలు సేకరిస్తున్న అధికారులు!