Maa Elections 2021: మా ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదల.. కండీషన్స్ అప్లై..

|

Sep 18, 2021 | 1:09 PM

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజు రోజూకీ రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ చేసే

Maa Elections 2021: మా ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదల..  కండీషన్స్ అప్లై..
Maa Elections
Follow us on

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజు రోజూకీ రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరిగింది. అలాగే.. నోటిఫికేషన్ విడుదల కాకముందే.. బహిరంగా ప్రచారాలు, విమర్శలు చేస్తూ.. మా ఎన్నికలపై హీట్ కలిగించారు అభ్యర్థులు. అయితే ఇప్పుడు ప్రధాన పోటీ.. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే పోటీ నుంచి జీవితా రాజశేఖర్, హేమ తప్పుకోగా.. అనుహ్యాంగా బండ్ల గణేష్ పోటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అభ్యర్థుల మధ్య పోటీ మరింత పెరిగింది. ఇప్పటికే బహిరంగా విమర్శలు చేసుకుంటూ మా లోసగులు తమకు తాముగా బయటపెడుతున్నారని.. క్రమశిక్షణ సంఘం కూడా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులు మా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై భిన్నరకాలుగా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మా ఎన్నికల నోటిఫిషన్ వచ్చేసింది. మా ఎన్నికలు 2021-23కు సంబంధించిన నోటిఫికేషన్‏ను ఈరోజు విడుదల చేశారు.

తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలీంగ్ జరుగుతుందని వెల్లడించారు. ఈనోటిఫికేషన్‏ను ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్ విడుదల చేశారు. అలాగే మా ఎన్నికలు జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‏లో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 8 మంది ఆఫీస్ బేరర్స్.. 18 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కోసం జరిగే ఈ ఎన్నికలకు ఈనెల 27 నుంచి 29 వరకు నామినేషన్స్ స్వీకరిస్తారు.30న నామినేషన్స్ పరిశీలన జరుగుతుంది. నామినేషన్స్ ఉపసంహరణకు వచ్చే 1-2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుంది. ఇక ఎలక్షన్స్‏లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను అక్టోబర్ 2న ప్రకటిస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించి సాయంత్రం 7 గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు.

ఇక తాజాగా విడుదలైన నోటిఫికేషన్‏లో నిబంధనలు ఇలా ఉన్నాయి.
* ఒక అభ్యర్ధి ఒక పోస్టుకే పోటీ చేయాలి
* గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్ లకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుంది.
* 24 క్రాప్ట్స్ లో ఆఫీస్ బేరర్‏గా ఉన్నవారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.

Also Read: Pooja Hegde : స్టార్ హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టేసిన బుట్టబొమ్మ.. అమ్మడి రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Samantha : లేడీ ఓరియెంటెడ్ కథల వైపే అక్కినేని కోడలు ఆసక్తి.. మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్..